Chiranjeevi
ఆశలు చిగురించడం వేరు..పెరగడం వేరు. టాలీవుడ్ లో ఈ రెండూ వుంటాయి. వరుసగా రెండు మూడు సినిమాలు ఆడితే నిర్మాతల ఆశలు చిగురిస్తాయి.
ఆశలు చిగురించడం వేరు..పెరగడం వేరు. టాలీవుడ్ లో ఈ రెండూ వుంటాయి. వరుసగా రెండు మూడు సినిమాలు ఆడితే నిర్మాతల ఆశలు చిగురిస్తాయి.
Chiranjeevi
ఆశలు చిగురించడం వేరు..పెరగడం వేరు. టాలీవుడ్ లో ఈ రెండూ వుంటాయి. వరుసగా రెండు మూడు సినిమాలు ఆడితే నిర్మాతల ఆశలు చిగురిస్తాయి. అంత వరకు ఓకె. జనాలు మళ్లీ థియేటర్ కు వస్తున్నారు. కంటెంట్ బాగుంటే డబ్బులు అవే వస్తాయి. ఇవన్నీ ఆశలు చిగురించడమే. కానీ రెండు సినిమాలు గట్టిగా ఆడితే అంత రేటు కావాలి..ఇంత రేటు కావాలి అనుకుంటే ఆశలు పెరగడం అనుకోవాలి.
పెద్ది, మా ఇంటి బంగారం ఇలా రెండు మూడు సినిమాలు ఆడడంతో, 2026 సెకండాఫ్ లో విడుదలయ్యే సినిమాలు అన్నింటికీ ఆశలు పెరిగిపోతున్నాయి. ఒక్కో సినిమా మంచి మంచి రేట్లు చెబుతున్నారు. కానీ బయ్యర్లు మాత్రం అటు ఇటు ఊగుతున్నారు. సినిమాలు ఆడతాయేమో..కొందాం అని ఒక పక్క. మరీ అంత రేటా? మీమాంస మరో పక్క బయ్యర్లను వెంటాడుతున్నాయి. నిర్మాతలు కూడా సినిమా కాంబినేషన్ లెక్క కాకుండా ఖర్చు లెక్క చూసి రేట్లు పెడుతున్నారు. కొత్త హీరో అయినా, మీడియా హీరో అయినా, హిట్ ల లైనప్ లేని హీరో అయినా, అవన్నీ చూడడం లేదు. ఆంధ్ర (రాయలసీమ కాకుండా) ఇరవై కోట్లు లేదా 12 కోట్లు లేదా ఎనిమిది కోట్లు అంటూ కోట్ చేస్తున్నారు.
సినిమా కంటెంట్ ఎలా వుంటుందో, ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. నిర్మాత ఆశించిన దానికన్నా డబుల్ మొత్తాలు రావచ్చు కూడా. కానీ ముందుగా బయ్యర్లు రిస్క్ లైన్ కు కాస్త దగ్గరగా వెళ్లడానికి ఓ లెక్క అంటూ వుంటుంది. అది సినిమా బజ్, కాంబినేషన్, బ్యానర్ ఇవన్నీ కలిసి లెక్కలు వేసుకుని ఫిక్స్ అవుతారు. ఆ నెంబర్ కు నిర్మాత కోట్ చేసే దానికి మధ్య కొంచెం తేడా వుంటే సరే, ఎక్కువ తేడా వుంటే ఇక నిర్మాతల వేట మొదలు పెడతారు.
ముందుగా ఏదో ఒక ఏరియా క్లోజ్ చేస్తారు. రూపాయికి ఇచ్చినా, రూపాయిన్నర రేటు చెప్పమంటారు. ఆ రూపాయిన్నరకు ఇచ్చామని ప్రచారం చేస్తూ మిగిలిన ఏరియాలు క్లోజ్ చేసే పని పెట్టుకున్నారు. బయ్యర్లు అంతకన్నా తెలివైన వారు. అది నిజమా కాదా అని ఎంక్వయిరీ లు మొదలుపెడతారు. ఇది ఇక్కడితో ఆగదు. ఆ జిల్లా బయ్యర్..ఈ జిల్లా బయ్యర్..ఇలా అందరి మధ్యలో డిస్కషన్లు మొదలవుతాయి. ఆఖరికి నిర్మాత ఎంత కొంత దిగి వస్తారు. లేదంటే అడ్వాన్స్ మీద తను అనుకున్న రేంజ్ కే రిలీజ్ పెట్టుకుంటారు.
దీనంతటికీ రెండు కారణాలు. ఒకటి బడ్జెట్ పెరగడం, నాన్ థియేటర్ ఆదాయం తగ్గడం. థియేటర్ దగ్గర కొంచెం ఎక్కువ రికవరీ చేసుకోవాల్సి రావడం. రెండవది..బయ్యర్లు ఓవర్ ఫ్లోస్ కరెక్ట్ గా ఇస్తారో, ఇవ్వరో అన్న అనుమానం. అందువల్ల ముందుగానే వీలయినంత ఎక్కువ లాగేద్దామనే ఆలోచన.
మొత్తం మీద ఒకటి అయితే ఆనందకరమైన విషయం.నిర్మాతలు.. బయ్యర్ల మధ్య బేరాలు సారాలు మొదలయ్యాయి. రాబోయే ఆరు నెలలు ఇదే హడావుడి వుంటుంది. మరో ఒకటి రెండు సినిమాలు కాస్త సుమారుగా ఆడినా, లేదా హిట్ అనిపించుకున్నా ఈ హుషారు పండగ వరకు అలా కొనసాగుతుంది.