iDreamPost
android-app
ios-app

Buchi Babu Sana: బుచ్చికి ఆప్షన్ ఎవరు?

ఉప్పెన సినిమా తరువాత మూడేళ్లకు పైగా అలా ఒకే సినిమా మీద వుండిపోయాల్సి వచ్చింది దర్శకుడు బుచ్చిబాబు.

ఉప్పెన సినిమా తరువాత మూడేళ్లకు పైగా అలా ఒకే సినిమా మీద వుండిపోయాల్సి వచ్చింది దర్శకుడు బుచ్చిబాబు.

Buchi Babu Sana: బుచ్చికి ఆప్షన్ ఎవరు?

ఉప్పెన సినిమా తరువాత మూడేళ్లకు పైగా అలా ఒకే సినిమా మీద వుండిపోయాల్సి వచ్చింది దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది సబ్జెక్ట్ పట్టుకుని ఎన్టీఆర్ డేట్ ల కోసం వేచి చూడడం, తరువాత అక్కడి నుంచి అదే సబ్జెక్ట్ ను వేరే బ్యానర్, వేరే హీరో అంటూ పక్కకి రావడం, అలా అలా మొత్తానికి పెద్ది సినిమా విడుదల వరకు వచ్చింది. కానీ ఈ సినిమా తరువాత ఎవరితో?

పెద్ది ఫైనల్ స్టేజ్ లో వుండగానే మైత్రీ సంస్థ అధినేతలు బుచ్చిబాబు ను తీసుకెళ్లి మహేష్ బాబుకు పరిచయం చేసి, లైన్ చెప్పించినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు తన తరువాత సినిమా ఎవరితో, ఏ బ్యానర్ తో అన్నది ఇంకా పూర్తిగా ఫిక్స్ కాలేదు. ఆయన చాలా ఆప్షన్లు చూస్తున్నారు.

అందువల్ల బుచ్చిబాబు కు ఎవరి డేట్ లు దొరుకుతాయి అన్నది చూడాలి. రామ్ చరణ్ మరో సినిమా చేయాలి అనుకున్నా అది ఇప్పట్లో కాదు. సుకుమార్ సినిమా సెట్ మీదకు వెళ్లాలి, పూర్తి కావాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. అంటే కనీసం ఏడాదిన్నర వెయిటింగ్ లో వుండాలి బుచ్చిబాబు.

లేదూ అంటే వేరే హీరో దగ్గరకు వెళ్లాలి అనుకున్నా ఎవ్వరూ ఖాళీ లేరు. బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరూ ఫుల్ లైనప్ పెట్టేసుకుని వున్నారు. విజయ్ దేవరకొండ, నాని ఇలా అందరూ బిజీనే. అందువల్ల ఉప్పెన తరువాత రెండు మూడేళ్లు వెయిట్ చేసినట్లు బుచ్చిబాబు వెయిటింగ్ లో వుంటారో, ఉప్పెన మాదిరిగా ఓ మిడ్ రేంజ్ సినిమా అందిస్తారో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom