iDreamPost
android-app
ios-app

Rao Bahadur, Nagabandham: రెండు ప్రయోగాలూ ఈ వారమే!

చిన్న హీరో..రెండో సినిమా దర్శకుడు. వంద కోట్ల బడ్జెట్..ఈవారం విడుదలవుతున్న నాగబంధం. చిన్న హీరో. మంచి దర్శకుడు. గట్టి బడ్జెట్. సర్రయిలిస్టిక్ సినిమా. ఈ వారం విడుదలవుతున్న రావు బహుదూర్.

చిన్న హీరో..రెండో సినిమా దర్శకుడు. వంద కోట్ల బడ్జెట్..ఈవారం విడుదలవుతున్న నాగబంధం. చిన్న హీరో. మంచి దర్శకుడు. గట్టి బడ్జెట్. సర్రయిలిస్టిక్ సినిమా. ఈ వారం విడుదలవుతున్న రావు బహుదూర్.

Rao Bahadur, Nagabandham: రెండు ప్రయోగాలూ ఈ వారమే!

చిన్న హీరో..రెండో సినిమా దర్శకుడు. వంద కోట్ల బడ్జెట్..ఈవారం విడుదలవుతున్న నాగబంధం.

చిన్న హీరో. మంచి దర్శకుడు. గట్టి బడ్జెట్. సర్రయిలిస్టిక్ సినిమా. ఈ వారం విడుదలవుతున్న రావు బహుదూర్.

ఈ రెండు సినిమాలకు రెండు రిస్క్ ఫ్యాక్టర్ లు. నాగబంధం సినిమా రెండు రాష్ట్రాల్లో దాదాపు అడ్వాన్స్ ల మీదే విడుదలవుతోంది. సినిమా గ్రాండియర్ గా వుంటుంది. విజువల్స్ బాగుంటాయి. అంతవరకు సమాచారం వుంది. కథ, కథనాలు ఎలా వుండబోతున్నాయి. వాటిలో ఈ చిన్న హీరో ఏ మేరకు ఫిట్ అయ్యారు అన్నది థియేటర్ లో బొమ్మ పడిన తరువాత తెలుస్తుంది. అన్నీ బాగుండి హీరో ఫిట్ కాకపోయినా సమస్యే. కాస్టింగ్ సెట్ కాకపోయనా సమస్యే.

ఎందుకంటే అంత గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ సినిమా అన్న తరువాత దానికి తగినట్లు కాస్టింగ్ కూడా వుండాలి. కొత్త, చిన్న కాస్టింగ్ అయినా కూడా ఫరవాలేదు. ఆ స్పాన్ కు తగినట్లు నటన కనబరిస్తే, పాత్రలకు సూటయితే పాస్ అయిపోతుంది. ఈ పాయింట్ తో సక్సెస్ లింక్ అయి వుంది. ఆ సక్సెస్ తో సినిమా బడ్జెట్ రికవరీ లింక్ అయి వుంది. ఎందుకంటే సినిమాను దాదాపుగా అడ్వాన్స్ ల మీదే విడుదల చేస్తున్నారు. అందువల్ల నిర్మాతలు సేఫ్ కావాలంటే టాక్ అనేది చాలా అంటే చాలా కీలకం.

ఇక రెండో సినిమా రావు బహద్దూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణ. ఛాయ్ బిస్కట్ సంస్థ నిర్మాణం. వెంకటేష్ మహా దర్శకుడు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అంతా పూర్తిగా సర్రయిలిస్టిక్ ధోరణిలోనే వుంది. ఇలాంటి సినిమాలకు రెండే రకాల టాక్ లు వస్తాయి. ఒకటి నచ్చిన వాళ్లు అహో..అద్భుతం అనడం. నచ్చని వాళ్లు ఇదేం సినిమా అని పెదవి విరిచేయడం.

ఈ సినిమాకు రివ్యూలు, రేటింగ్ లు వచ్చే అవకాశం ఎక్కువ వుంది. అంటే క్రిటికల్ అప్లాజ్ అన్నమాట. థియేటర్ లో కామన్ మాన్ కు నచ్చడంతో కలెక్షన్ అన్నది ముడిపడి వుంటుంది. నాగబంధంతో పోల్చుకుంటే రావు బహుదూర్ కు పెద్దగా ఫైనాన్సియల్ రిస్క్ లేదు. కానీ వెంటేష్ మహా, మహేష్ బాబు, ఛాయ్ బిస్కట్ పేర్లు అసోసియేట్ అయి వున్నాయి కనుక, ప్రెస్టీజ్ క్వశ్చన్ అని అనుకోవాల్సిందే.

నాగబంధం హిట్ అయితే..డేర్ చేసారు..కొట్టారు అంటారు. ఫ్లాప్ అయితే కొత్త వాళ్ల మీద అంత పెట్టి రిస్క్ చేసారు అనవసరంగా అంటారు.

రావు బహుదూర్ హిట్ అయితే వెంకటేష్ మహా మంచి డైరక్టర్ ..అతనికి విషయం వుంది అంటారు. ఫ్లాప్ అయితే ఈ సర్రయిలిస్టిక్ సినిమాలు జనం ఏం చూస్తారు అంటారు..అంతే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet