iDreamPost
iDreamPost
’జగన్ నివాసానికి ఒక రూల్… సామాన్యులకు మరో రూలా’ అంటూ ఎల్లోమీడియా ఓ కథనం ఇచ్చింది. ఈ కథనంతోనే జగన్మోహన్ రెడ్డిపై తనకున్న కసినంతా బయటపెట్టుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ నివాసముండే తాడేపల్లికి సమీపంలో ఓ మహిళ కరోనా వైరస్ తో చనిపోయింది . దాంతో ఆ ప్రాంతమంతా రెడ్ జోన్ కింద డిక్లేర్ అయినట్లు మీడియానే ప్రచారం చేసింది. రెడ్ జోన్ లో నివాసముంటున్న వాళ్ళెవరూ ఇళ్ళల్లో నుండి బయటకు రాకూడదనేది నిబంధన…
ఊరు పేరు చెప్పకుండానే ఇదే విషయమై ఎల్లోమీడియా అచ్చేసిన కథనంలో జనాభిప్రాయం ప్రకారం సిఎం కూడా తన ఇంట్లో నుండి బయటకు రాకూడదని జనాలు అనుకుంటున్నారంటు ఓ పిచ్చి కథనాన్ని ఇచ్చింది. అయితే జరుగుతున్న ప్రచారంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తు 4 పాజిటివ్ కేసులుంటేనే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తామని చెప్పాడు. తాడేపల్లి ప్రాంతంలో బయటపడింది ఒక్క కేసే కాబట్టి సిఎం నివాసముండే ప్రాంతం రెడ్ జోన్ క్రిందకు రాదని స్పష్టం చేశారు.
Also Read:సీఎం నివాసం రెడ్ జోన్ కాదు..!
అయితే కలెక్టర్ ప్రకటనపై జనాలు మండిపడుతున్నారంటు ఓ కథనాన్ని అల్లేసింది. సీఎం నివాసం ఉంటున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించకపోవడం మీద జనాలు మండిపోతున్నారని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే ఎల్లోమీడియా ఉద్దేశ్యం ప్రకారం జగన్ కూడా ఇంట్లో నుండి బయటకు రావటానికి వీల్లేదన్నట్లే ఉంది మొత్తం కథనం. కాకపోతే తన పైత్యానికి జనాభిప్రాయమంటూ జోడించింది.లాక్ డౌన్ సమయంలో వీరు ఏ ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారో?ఎలా తీసుకున్నారో వారికే తెలియాలి.
నిజానికి వైరస్ తో మహిళ చనిపోయింది సిఎం నివాసానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో. ఎల్లోమీడియా మాత్రం జగన్ నివాసానికి కూతవేటు దూరం అని రాసింది. నాలుగు కిలోమీటర్ల దూరమంటే ఎల్లోమీడియా ఉద్దేశ్యంలో కూతవేటు దూరమా ? నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ వైరస్ తో చనిపోతే జగన్ ను సీన్ లోకి లాక్కొచ్చి ఎల్లోమీడియా చేస్తున్న రాద్దాంతం ఆశ్చర్యంగా ఉంది. ఎల్లోమీడియా ఆలోచన ప్రకారం జగన్ కూడా ఇంట్లో నుండి బయటకు రాకూడదు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకూడదు, ఎవరితో కలవకూడదు అన్నట్లుగానే ఉంది. జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియాకు పిచ్చి ముదిరిపోతోందనటానికి ఇదే నిదర్శనం.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జగన్ క్వారంటైన్ కు వెళ్లాలని కొద్దీ రోజులు రాసిన మీడియా ,ఇప్పుడు సీఎం నివాసాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని రాయటంలో వారి ఉద్దేశ్యం సుస్పష్టం.