Idream media
Idream media
దేశమంతా కరోనా బారినపడి విలవిలలాడుతుంటే ఈశాన్య రాష్ట్రాలు మాత్రం అందుకు మినహాయింపుగా ఉన్నాయి.ముఖ్యంగా మణిపూర్ భారత్‌లో కరోనా వైరస్ ఫ్రీ తొలి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మణిపూర్ రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా ప్రస్తుతం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన 65 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను రాజధాని ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్ప్రతిలో చేరి చికిత్స పొందుతున్నాడు.అయితే తాజాగా శనివారం అతనికి నిర్వహించిన కరోనా రోగ నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌గా తేలింది.
నేటి వరకు మణిపూర్‌లో కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.ఆ రాష్ట్రంలో మార్చి 24వ తేదీ మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయింది.యూకే నుంచి వచ్చిన ఒక 23 ఏళ్ల యువతికి మొదటిసారి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది,రెండో కేసు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన 65 ఏళ్ల వ్యక్తిది.రెండు కరోనా పాజిటివ్ కేసులు చికిత్స అనంతరం నెగిటివ్‌గా మారడంతో ప్రస్తుతం మణిపూర్ కరోనా విముక్తి రాష్ట్రంగా ఆయన పేర్కొన్నారు.
కోవిడ్-19 లక్షణాలతో ఆస్ప్రతిలో చేరి చికిత్స పొందిన రెండో వ్యక్తికి మరోసారి పరీక్షలు నిర్వహించి అందులోనూ నెగెటివ్‌గా ఫలితం వస్తే అతన్ని డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.