iDreamPost
iDreamPost
మీడియా అత్యుత్సాహం, సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపడం లాంటి కారణాల వల్ల అంతర్గతంగా జరగాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు క్రమంగా అసెంబ్లీ ఎలక్షన్స్ రేంజ్ లో హడావిడి చేస్తున్నాయి. వచ్చే నెల 10న రణరంగం సిద్ధమవుతోంది. నిజానికిది చాలా సింపుల్ వ్యవహారం. కానీ గత కొనేళ్లుగా పోటీ చేస్తున్న వాళ్ళు, మాజీ ప్రెసిడెంట్లు, సభ్యులు చేస్తున్న రచ్చ వివాదాలతో ఇదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూలా ప్రొజెక్ట్ చేయడం మొదలైపోయింది. పరస్పర ఆరోపణలు, సమర్ధింపులు, వీడియో మెసేజులు, ప్రెస్ నోట్లు ఒకటా రెండా మాములు హడావిడి జరగలేదు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ఎప్పుడో ప్రకటించగా ఇప్పుడు విష్ణు వచ్చేశాడు.
మంచు విష్ణు బృందంలో ఎవరెవరు ఉండబోతున్నారో క్లారిటీ ఇచ్చేశారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, మాదాల రవి-30 ఇయర్స్ పృథ్వి జాయింట్ వైస్ ప్రెసిడెంట్లుగా, శివాజీరాజా-కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీలుగా, శివ బాలాజీ ట్రెజరర్ గా నామినేట్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా వేదా, గీత సింగ్, పూజిత, సంపూర్ణేష్ బాబు, శశాంక్ తదితరులు ఉన్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ టీమ్ అంత బలంగా కనిపించకపోయినా విష్ణు మాత్రం గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నాడు. బండ్ల గణేష్ ఇటు వైపు రావొచ్చేమో అనే ఊహాగానాలను తప్పని తేలాయి.
ఇక వచ్చే వారం నుంచి మా ఎన్నికల వేడి పెరగబోతోంది. ఇటీవలి కాలంలో ప్రతి చిన్నదానికి స్పందిస్తూ టాలీవుడ్ యాక్టర్లు వీడియో బైట్లను సోషల్ మీడియాలో పెట్టడం సాధారణం అయిపోయింది. సాయి ధరమ్ తేజ్ ఇన్సిడెంట్ లో కూడా నరేష్, శ్రీకాంత్, బండ్ల గణేష్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. దీనికే అలా అయితే ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా వ్యవహారంలో ఇంకేమేం చేయబోతున్నారో చూడాలి. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉన్న ప్రకాష్, అదే మెగాస్టార్ మంచి స్నేహితుడుగా ఉన్న మోహన్ బాబు కుమారుడు విష్ణుల మధ్య పోరు మాత్రం హోరాహోరీగా ఉండబోతోంది. ఈ పదిహేను రోజు కీలక పరిణామాలు ఉండటం ఖాయమే
Also Read : చైతు సినిమాకు ఎప్పుడూ చూడని స్పందన