iDreamPost
android-app
ios-app

ఇద్దరు యువతులతో ప్రేమయాణం.. మరో అమ్మాయితో పెళ్లి!

అల్లు అర్జున్ అనుకున్నాడమే.. ఇద్దరు అమ్మాయిలతో అంటూ రొమాన్స్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ.. కాపురం చేసేశాడు. ఇక పెళ్లి దగ్గరకు వచ్చేసరికి.. ఇద్దరూ యువతులను షాక్ ఇస్తూ..

అల్లు అర్జున్ అనుకున్నాడమే.. ఇద్దరు అమ్మాయిలతో అంటూ రొమాన్స్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ.. కాపురం చేసేశాడు. ఇక పెళ్లి దగ్గరకు వచ్చేసరికి.. ఇద్దరూ యువతులను షాక్ ఇస్తూ..

ఇద్దరు యువతులతో ప్రేమయాణం.. మరో అమ్మాయితో పెళ్లి!

ఈ రోజుల్లో పెళ్లి అంటే టైమ్ పాస్ బఠాణీలా మారిపోయింది. ప్రేమించిన అమ్మాయితో రొమాన్స్ చేస్తూనే.. మరో యువతికి మనస్సు ఇవ్వడం. ఆమెతో సినిమాలు, ఈమెతో షికార్లు చేస్తుంటాడు ప్రేమికుడు. బేబీ అంటూ లవ్ ఒలకబోయడం, తను తప్ప మరో యువతి తెలియదన్నట్లు మోసం చేస్తుంటారు. చివరకు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ప్రేమించిన అమ్మాయిల్లో బెస్ట్ ఆప్షన్ చూసుకుని, పెళ్లి చేసుకుంటుంటారు. లేదంటే ఇద్దరికి గుడ్ బై చెప్పి.. మరో మహిళతో పెళ్లికి సిద్ధమవుతుంటారు. ఇదే జరిగింది మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇద్దరు యువతులను మోసం చేసి మూడవ అమ్మాయితో పెళ్లి తంతుకు సిద్ధమైన యవకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. తన తోటి ఉద్యోగురాలిని ప్రేమ, పెళ్లితో వంచించాడు. వెంగళరావు నగర్ డివిజన్‌లోని బస్తీలో ఉంటున్న ప్రేమికురాలి ఇంటికి వచ్చి.. తన కోర్కెలు తీర్చుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆమెకు చెప్పకుండా.. మరో ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరాడు. అక్కడ కూడా మరో యువతికి కూడా మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఇద్దరితో కాలక్షేపం చేయసాగాడు. ఇటీవల ఇంటికి వెళ్లిన ఫక్రుద్దీన్.. తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలని అనుకున్నాడు.

సినిమాలో తాళి కట్టే సమయానికి ఆపండి అంటూ ఎవరో ఒకరు సీనులోకి ఎంటరైనట్లు.. ఫక్రుద్దీన్, కాబోయే వధువు ఇద్దరు దండలు మార్చుకునే సమయంలో ఎంటరయ్యారు పోలీసులు. మధురానగర్ ఎస్ఐ అక్కడకు చేరుకుని నిశ్చితార్థాన్ని అడ్డుకున్నాడు. పెద్దలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. అయ్యగారి లీలలన్నీ కుటుంబ సభ్యులకు వెల్లడించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే అతడ్ని పోలీసులు తీసుకు వచ్చారని తెలిసి.. అతడితో సంబంధం పెట్టుకున్న ఇద్దరు యువతులు స్టేషన్లకు వచ్చి.. అతను నావాడంటే.. నావడంటూ వాదులాడుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. అయితే పోలీసులు.. అతడిని రిమాండుకు తరలించారు.