స్కాం సూత్రధారి లోకేష్.. అచ్చన్న బలయ్యాడు – వల్లభనేని వంశీ

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ESI స్కాంలో ఇప్పటికే సూత్రధారిగా తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మిక మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన అచ్చం నాయుడితో పాటు సంబంధిత అధికారులని అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మరో 12 మందిని రాబోయే రోజుల్లో అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తెలిపింది. ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓటింగ్ లో పాల్గొన్న గుడివాడ శాసన సభ్యులు వల్లభనేని వంశీ ఒక ప్రముఖ మీడియా చానల్ తో మాట్లాడుతు గత ప్రభుత్వంలో జరిగిన ESI స్కాంపై ఆసక్తికర వాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేయలేదని, 30ఏళ్ళ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న అచ్చం నాయుడులాంటి సీనియర్ లీడర్ ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అయ్యారు అంటే దాని వెనక ఉన్న సూత్రధారులు ఎవరా అనేది అందరికీ తెలిసిన విషయమే అని, ఖచ్చితంగా ఈ స్కాం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రమేయంతోనే జరిగి ఉండొచ్చు అని లోకేష్ మైండ్ సెట్ తమకు తెలుసని, వీరు చేసిన స్కాంకి అచ్చం నాయుడు లాంటి సీనియర్ నాయకులు బలిపశువయ్యారని రేపటి రోజున తెలుగుదేశం నుండి పత్తిపాటి పుల్లారావు కాని, దేవినేని ఉమా లాంటి వారు కానీ ఎవరు అరెస్టు అయినా దానికి మూల కారణం లోకేష్ మాత్రమే అయి ఉంటాడని చెప్పుకొచ్చారు.

Show comments