Idream media
Idream media
అసెంబ్లీలో కొడాలి నాని మాట్లాడుతూ పెద్దల సభ అంటే బరువైన వ్యక్తుల సభ కాదని అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు అనుభవం అని ప్రగల్భాలు పలికే చంద్రబాబుని జగన్ గ్యాలరీ ఎక్కించాడని ఎద్దేవా చేస్తూ, జగన్ గట్టిగా కృషి చేసి అసెంబ్లీలో కూడా బాబుని గ్యాలరీకే పరిమితం చేయాలని అన్నారు.
నిజానికి గతంలో గ్యాలరీలో కూర్చుని కౌన్సిల్ ని మేనేజ్ చేసిన మాజీ ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ లేరు. బాబు తాను అనుకున్నది సాధించడానికి స్థాయిని కూడా మరచిపోతారనడానికి ఇది ఉదాహరణ.
ఇక లోకేష్ మీద కూడా జోకులు పేలాయి. లోకేష్ కి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నాని అన్నారు. ఎలాగంటే రద్దయిన కౌన్సిల్ లో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ఉంటే మంచిదని వైఎస్ అనుకోవడం వల్లే కౌన్సిల్ పునరుద్ధరణ జరిగింది.
కౌన్సిలే లేకపోతే లోకేష్ ఎప్పటికీ మంత్రి అయ్యేవాడు కాదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో గెలవడం లోకేష్ వల్ల కాదు. అదే విధంగా యనమల అప్పుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు రాజ్యాంగానికే పోటు పొడిచాడన్నారు. షరీఫ్ గతంలో రోజుకి పది గంటలు టీడీపీ ఆఫీసులో ఉండేవాడని, పార్టీకి విధేయుడు కాబట్టి కౌన్సిల్ లో ఇలా వ్యవహారించాడని నాని అన్నారు.