iDreamPost
android-app
ios-app

ఎంపీ గారి అతితెలివి …!!మార్ఫింగ్ అంటూ బుకాయింపు ..

ఎంపీ గారి అతితెలివి …!!మార్ఫింగ్ అంటూ బుకాయింపు ..

అదంతే …ఆయన చేయాలనుకున్నది చేసేయ్యడం , అదేంటీ అలా చేశారు ..తప్పు కదా అని ఎవరైనా అంటే ‘నేనేమి తప్పు చేయలేదు… మీ చూపుల్లోనే తేడా ఉంది’ అంటూ బుకాయింపు …ఇదంతా మరెవరిగురించో కాదు…విజయవాడ ఎంపీ కేశినేని నాని గారి గురించే…

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ డిస్టన్స్ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి…కేంద్రమంత్రిమండలి సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్షల్లోనూ అందరూ ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అయితే నాని మాత్రం శనివారం విజయవాడలో కొందరు ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మంది మార్బలంతో జనంలోకి వెళ్లడమే కాకుండా ప్రజలతో కూడా దగ్గరగా మెలిగారు. ఇవన్నీ నిషిద్ధం అన్న విషయం ఆయనకు తెలీదనుకోవడం మన పొరపాటు.

మీడియాను, దేశ అంతర్జాతీయ వ్యవహారాల మీద తరచు ట్విట్టర్లో యాక్టివ్ గా పోస్టులు పెట్టె ఆయన సోషల్ డిస్టన్స్ పాటించకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పచ్చు. దీనిమీద మీడియాలో వార్తలు రావడం, ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆయన నాలుక తిరగేశారు. తాను చాలా పద్ధతిగా ఉన్నానని, మీడియావాళ్ళు మార్ఫింగ్ చేసి ఫోటోలను పబ్లిష్ చేసారని ఎదురుదాడికి దిగారు.

పోనీ సాక్షి వంటి పత్రిక అలా రాసిందంటే అది జగన్ పత్రిక కాబట్టి ప్రజలు కానీ , నాని కానీ నమ్మక్కర్లేదు. కానీ టిడిపి మద్దతుదారు అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇలాగే వీడియో ప్రసారం కావడాన్ని కూడా ఆయన గుర్తించకుండా బుకాయించడం విస్తుగొలుపుతోంది. చేసిందే తప్పు, తిరిగి మీడియా మీద ఎదురుదాడి చేయడం ఎంపీ స్థాయికి తగదని ఆయన గుర్తు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది