iDreamPost
android-app
ios-app

పిల్లల హంతకుడి కథ ‘పెంగ్విన్’

  • Published Jun 11, 2020 | 6:57 AM Updated Updated Jun 11, 2020 | 6:57 AM
పిల్లల హంతకుడి కథ ‘పెంగ్విన్’

కరోనాతో ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన కొత్త సినిమాలు మెల్లగా ఓటిటి బాట పడుతున్నాయి. తెలుగులో అమృతరామమ్ తోనే ఇది మొదలైంది కాని అది ఏ మాత్రం విషయం లేని చిన్న మూవీ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు స్టార్ హీరో హీరొయిన్లు నటించినవి కూడా రేస్ లోకి రావడంతో ప్రేక్షకులు వీటివైపు చూస్తున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘పెంగ్విన్’ ఈ నెల 19న నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కాబోతోంది. దాన్ని పురస్కరించుకుని తెలుగు వెర్షన్ ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని ద్వారా లాంచ్ చేశారు. ఇది మలయాళం, తమిళ్ లోనూ రాబోతోంది.

రెండున్నర నిమిషాల ట్రైలర్ కథేంటో చెప్పేశారు. చుట్టూ వెయ్యి ఎకరాల అడవి ఉండే ప్రశాంతమైన ప్రాంతంలో జీవితం గడుపుతున్న అమ్మాయి(కీర్తి సురేష్)కు ఊహించని గండం ఎదురవుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు(అజయ్)తప్పిపోతాడు. పోలీసులు వేట మొదలుపెడతారు. అంతుచిక్కదు. ఈలోగా ఛార్లీ చాప్లిన్ మాస్క్ తో తిరుగుతున్న సైకో కిల్లర్ జాడ తెలుస్తుంది. కానీ దొరకడు. ఈలోగా ఇంకో వేరే పిల్లాడు కూడా తప్పిపోతాడు. అసలు అజయ్ ఎక్కడికి వెళ్ళాడు, బ్రతికే ఉన్నాడా, వాడి దాకా ఆమె ఎలా వెళ్ళింది అనేదే పెంగ్విన్ కథ.మొత్తానికి ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. గతంలోనూ ఇలాంటి సైకో కిల్లర్ డ్రామాలు వచ్చినప్పటికీ ఇది కొంచెం డిఫరెంట్ గానే కనిపిస్తోంది.

భారమంతా కీర్తి సురేష్ మీద పడింది. తను తప్ప ఇంకెవరు తెలిసిన ఆర్టిస్టులు లేరు. అన్ని తమిళ మొహాలే. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం, కార్తిక్ పళని ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. సంతోష్ నారాయణ్ బిజిఎం కూడా బాగా ఎలివేట్ అయ్యింది. ఈ జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు పెంగ్విన్ మంచి ఛాయస్ అయ్యేలా ఉంది. కొన్ని షాట్స్ లో కీర్తి సురేష్ ని గర్భవతిగా చూపించడం ఆసక్తి రేపుతోంది. బిడ్డ కోసం వెతికే తల్లిగా చాలా ఎక్స్ ప్రెసివ్ గా నటించింది. ఊహించని థ్రిల్స్, ట్విస్టులు చాలా ఉన్నట్టే ఉన్నాయి. మొత్తానికి మంచి క్రైమ్ థ్రిల్లర్ తో కీర్తి సురేష్ ఇలా నేరుగా ఆన్ లైన్ లో రావడం విశేషం. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరో, పిల్లలను ఎందుకు చంపుతాడో, అజయ్ చివరికి తన తల్లి వద్దకు చేరుకున్నాడా లేదా లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఈ నెల 19న ప్రైమ్ లో డైరెక్ట్ గా చూడాల్సిందే.

Link Here @ https://bit.ly/2YrwkAb

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişcasibom