iDreamPost
android-app
ios-app

sarkaru vaari paata సర్కారులో మహేష్ పాత్ర లీక్

  • Published May 03, 2022 | 5:38 PM Updated Updated May 03, 2022 | 5:38 PM
sarkaru vaari paata సర్కారులో మహేష్ పాత్ర లీక్

నిన్న విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ ఇరవై నాలుగు గంటలు గడవకముందే హయ్యెస్ట్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో కొత్త రికార్డులకు ఈ వీడియోతోనే శ్రీకారం చుట్టేసింది. మహేష్ బాబు ఫాన్సే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ వర్గాలకు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. ఆచార్య మరీ దారుణంగా ఊసులో లేకుండా పోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో సహా అందరి ఆశలు దీని మీదే ఉన్నాయి. అందుకు తగ్గట్టే దర్శకుడు పరశురామ్ అన్ని కమర్షియల్ అంశాలను మేళవించడంతో ఇదో కంప్లీట్ ప్యాకేజన్న అభిప్రాయం కలిగింది.

సరే ఇక అసలు విషయానికి వస్తే ఇందులో మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తి రేపుతున్నాయి. వాటి ప్రకారం హీరో ఇందులో ఒక బ్యాంక్ తరఫున జన జీవితంలోకి మాములు ఫైనాన్స్ వ్యాపారిగా అడుగు పెడతాడు. అతని లక్ష్యం వందల కోట్ల అప్పులు తీసుకుని చట్టంలోని లొసుగులు ప్రభుత్వ వ్యవస్థలోని శక్తులను అడ్డం పెట్టుకున్న వాళ్ల భరతం పట్టడం. దాంతో పాటు మరో గోల్ కూడా ఉంటుంది. అందుకే మేనేజర్ స్థాయి వ్యక్తి ఊర మాస్ అవతారంలోకి దిగిపోతాడు. తర్వాత వాళ్ళ ఆట ఎలా కట్టించాడు పెద్ద తిమింగలాలను ఎలా పట్టుకున్నాడనేదే సర్కారు వారి పాట మెయిన్ పాయింటని వినికిడి.

మరి టైటిల్ అలా ఎందుకు పెట్టారనే డౌట్ వస్తోంది కదూ. నిరర్ధక ఆస్తులను బ్యాంకులు, గవర్నమెంటులు వేలం వేసేటప్పుడు జరిగే ప్రహసనంలో హీరో విలన్ పాత్రలు చాలా కీలకంగా ఉంటాయట. అందుకే దానికి సరిపోయేలా ఆ పేరు ఫిక్స్ చేశారని తెలిసింది. థియేటర్లకు ఈ నెలలో సర్కారు వారి పాట మొదటి పెద్ద సినిమా. ఎఫ్3 వచ్చేదాకా మంచి గ్యాప్ ఉంటుంది. ఒకవేళ హిట్ టాక్ వచ్చిందా సెలవులను వాడుకుని సరిలేరు నీకెవ్వరు రికార్డులను ఈజీగా కొట్టేయొచ్చు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఏకంగా నాన్ ఆర్ఆర్ఆర్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ట్రైలర్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చాలా ఉన్నాయి. చూడాలి మరి.