iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఆది నుంచీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నీ చర్యలూ చేపడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సూచనలతో అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ రోజూ వేలాది శాంపిల్స్ సేకరిస్తున్నారు. అందువల్ల కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయి. అదే మంచిది కూడా.
ఎందుకంటే కేసుల లెక్క తేలితే ఆ ప్రాంతాల్లో తగిన నివారణ కార్యక్రమాలు చేపట్టి వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వ్యూహంతో నే ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు విరివిగా చేస్తున్నారు. అలాగే.. ఏ విషయంలోనూ దాపరికాలు లేకుండా జగన్ ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తో కలిసి జీవించాల్సిందే అనే వాస్తవాన్ని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇది ఓర్వలేని పవన్ లాంటి వాళ్ళు ఆయనపై విమర్శలు చేశారు. జగన్ చెప్పిన విషయాన్నే ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అదే చెప్పారు. కరోనా తో కలిసి జీవించాల్సిందే అని సోమవారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించే వారు ఎవరైనా ఆ ప్రజలకు వాస్తవాలే చెబుతారు. ఆ విషయంలో జగన్ అందరి కంటే ముందే ఉంటున్నారు. అంతే కాదు.. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది.