iDreamPost
android-app
ios-app

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు– దోబూచులాడుతున్న ఆధిక్యం

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు– దోబూచులాడుతున్న ఆధిక్యం

జార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఆధిక్యం దోబూచులాడుతూ ఆసక్తిని రేపతున్నాయి. ఉదయం ఓట్ల లెక్కింపు నుంచి ఇప్పటి వరకు ఆధిక్యం చేతులు మూరుతూ పార్టీల్లో గుబులురేపుతోంది. మధ్యహ్నం 12 గంటల సమయానికి కాంగ్రెస్‌ కూటమి 39 సీట్లలో, బీజేపీ 30 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా 4, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ పార్టీ 5, ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు

ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య సీట్ల పెరుగుదల, తగ్గుదల కనిపిస్తోంది. ఇతల పార్టీల ఆధిక్యం నిలకడగా ఉంది.
గత ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో బీజేపీకి 37, జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు 19, కాంగ్రెస్‌కు 6, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ పార్టీ 5, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా 8 సీట్లలో గెలిచాయి. ఆర్‌జేడీకి గత ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కాగా ఎన్నికల ఫలితాల తర్వాత జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.