Swetha
ఈగ, మర్యాద రామన్న, మగధీర, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల సమయంలో రాజమౌళి ఒకే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తానూ సినిమాను ఎలా తీయబోతున్నాడు. ఆ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి. ఆడియన్స్ ఆయన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ సినిమా తీసే సమయంలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి పక్కా క్లారిటీ ఇచ్చేస్తాడు. కానీ SSMB 29 విషయంలో మాత్రం ఇది ఇప్పటివరకు జరగలేదు.

ఈగ, మర్యాద రామన్న, మగధీర, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల సమయంలో రాజమౌళి ఒకే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తానూ సినిమాను ఎలా తీయబోతున్నాడు. ఆ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి. ఆడియన్స్ ఆయన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ సినిమా తీసే సమయంలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి పక్కా క్లారిటీ ఇచ్చేస్తాడు. కానీ SSMB 29 విషయంలో మాత్రం ఇది ఇప్పటివరకు జరగలేదు. అప్పుడప్పుడు లీకులు టీం నుంచి కొన్ని పోస్ట్ లు రావడం.. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన కథలు వాళ్ళు అల్లడమే కానీ.. ఈ సినిమా విషయంలో క్లారిటీ అయితే రాలేదు.
ఇక ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలకు తెరపడే సమయం వచ్చేసింది. నవంబర్ లో సినిమాకు సంబందించిన అప్డేట్ ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఇది సినిమా టైటిల్ అయ్యి ఉండొచ్చు లేదా సినిమాకు సంబందించిన ఓ గ్లిమ్ప్స్ అయినా అయ్యి ఉండొచ్చు. దీనికి ఓ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఆ ఈవెంట్ లో ఓ గ్లిమ్ప్స్ అయితే చూపించబోతున్నారని. దానికి సంబందించిన ఎడిటింగ్ , ఆర్ఆర్ కూడా కంప్లీట్ అయిందని.. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారని టాక్. సో ఆ గ్లిమ్ప్స్ లో ఏమి చూపించబోతున్నారు అనే విషయంపై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది.
ఈ గ్లిమ్ప్స్ లో అసలు కథ ఏంటి అనేది ప్రేక్షకులకు పరిచయం చేయొచ్చని టాక్. ఈ సినిమా కథకు రామాయణం కు లింక్ ఉన్నట్లు ఆ మధ్య టాక్ బాగా నడించింది. ఒకవేళ అదే కనుక నిజమైతే దానికి సంబందించిన షాట్స్ ఇందులో ఉండొచ్చు. ఇక కెన్యాలో ఓ షెడ్యూల్ , హైదరాబాద్ లో వారణాసి సెట్ వేసి మరో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. సో వాటికీ సంబందించిన షాట్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇక రాజమౌళి మైండ్ లో ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.