Swetha
ప్రతి వారం ఓటిటి లో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. అటు థియేటర్స్ లో ఎలాగూ ఈ వారం మెప్పించతగిన సినిమాలు లేవు. సో మూవీ లవర్స్ కు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఓటిటి. ఈ వారం ఓటిటి లో ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ప్రతి వారం ఓటిటి లో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. అటు థియేటర్స్ లో ఎలాగూ ఈ వారం మెప్పించతగిన సినిమాలు లేవు. సో మూవీ లవర్స్ కు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఓటిటి. ఈ వారం ఓటిటి లో ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Swetha
ప్రతి వారం ఓటిటి లో చాలానే సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. అటు థియేటర్స్ లో ఎలాగూ ఈ వారం మెప్పించతగిన సినిమాలు లేవు. సో మూవీ లవర్స్ కు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఓటిటి. ఈ వారం ఓటిటి లో ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వీటిలో ఈ వీకెండ్ అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
రీసెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఓజి మూవీ. ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ థియేటర్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. దీనికి సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ . థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి.
దీనితో పాటు శక్తి తిరుమాగన్ అనే ఓ రాజకీయ మధ్యవర్తి చుట్టూ తిరిగే తమిళ పొలిటికల్ డ్రామా కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఆ మధ్యవర్తికి సెక్రటేరియేట్ లో అందరూ తెలుసు. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తిచేస్తాడు. ఈ క్రమంలో అతను కొన్ని కోట్ల విలువ చేసే ఓ దోపిడీ చేసి పరారీలో ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు శక్తి తిరుమాగన్.. తెలుగులో భద్రకాళి. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అలాగే అక్యూస్డ్ అనే మరో సినిమాను ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమా కనక్కు అనే ఓ సాధారణ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను తన చెల్లి , సన్నిహితులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. న్యాయం కోసం అతను ప్రమాదంలో పడతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.