Swetha
ఈ మధ్యకాలంలో క్యామియోలు చాలా కామన్ అయిపోయాయి. పాత హీరోలు కొత్త సినిమాలలో గెస్ట్ రోల్ చేయడం, లేదా ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఓ సినిమా రావడం. ఇదంతా చాలా సహజం అయింది. కొన్ని సినిమాల విషయంలో ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతున్నారు కూడా. దీనితో దర్శకులు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. కొందరు ముందే అనౌన్స్ చేస్తుంటే ఇంకొందరు దాచి దాచి డైరెక్ట్ గా థియేటర్లో సర్ప్రైజ్ చేస్తున్నారు

ఈ మధ్యకాలంలో క్యామియోలు చాలా కామన్ అయిపోయాయి. పాత హీరోలు కొత్త సినిమాలలో గెస్ట్ రోల్ చేయడం, లేదా ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఓ సినిమా రావడం. ఇదంతా చాలా సహజం అయింది. కొన్ని సినిమాల విషయంలో ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతున్నారు కూడా. దీనితో దర్శకులు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. కొందరు ముందే అనౌన్స్ చేస్తుంటే ఇంకొందరు దాచి దాచి డైరెక్ట్ గా థియేటర్లో సర్ప్రైజ్ చేస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ లో వెంకీ క్యామియో ఉండబోతుందని ముందే చెప్పేసారు.
ఇక ఇప్పుడు చిరంజీవి వెంకీని సెట్స్ మీదకు వెల్కమ్ చేస్తున్నట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంకీని చిరంజీవి బ్రదర్ అని పిలిస్తే, బాస్ అంటూ వెంకీ సంభోదించడం వీడియోలో కనిపించింది. వీరిద్దరి మధ్య దాదాపు 20 నిమిషాలు సీన్స్ ఉండబోతున్నాయట. నవంబర్ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చిరు-వెంకీ కాంబినేషన్ లో కామిడితో పాటు.. ఓ సాంగ్ ఓ యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేసాడట దర్శకుడు అనిల్ రావిపూడి.
ఆల్రెడీ సినిమా మీద భారీ బజ్ ఉంది. అలాగే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. ఇక ఇప్పుడు మోస్ట్ ఎవెయిటింగ్ కాంబినేషన్ తెరపైకొచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో.. ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025