iDreamPost
android-app
ios-app

అవును.. ఆయన నిజంగా ‘భ‌రోసా’.. కల్పించారు..!

అవును.. ఆయన నిజంగా ‘భ‌రోసా’.. కల్పించారు..!

ఏ రాష్ట్రంలో నైనా ప్ర‌జ‌లు నిశ్చింత‌గా.. జీవించాలంటే వారికి తగిన భరోసా కలిగించే సత్తా.. ఆ రాష్ట్రాన్ని పాలించే నేత‌కు ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ఆర్థికంగా అండ‌గా నిలవాలి… ఆ కోవ‌కు చెందిన నాయ‌కుడిగా గుర్తింపు పొందుతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అందుకు ఆయ‌న వివేకవంతమైన ప్రణాళిక.. వేగవంతమైన చర్యలు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే తపనతో తీసుకొస్తున్న ప‌థ‌కాలే నిద‌ర్శ‌నాలు.

ముఖ్యంగా రాష్ట్ర రైతుల అభివృద్ధిలో ఆయ‌న విజ‌న్ గ‌మ‌నిస్తే.. ప్ర‌తిప‌క్షాలు స‌హా.. మ‌న‌సున్న వారెవ‌రైనా మెచ్చుకుని తీరాల్సిందే. గత ప్రభుత్వం రైతుల‌కు చెల్లించని రూ.384 కోట్ల విత్తన బకాయిలను కూడా ఇచ్చి ఈ ప్ర‌భుత్వం మ‌న కోసమే ఉంద‌న్న భ‌రోసాను రైతుల‌కు క‌ల్పించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. మొక్కజొన్న, టమాట, అరటి వంటి పంటలను సైతం కొనుగోలు చేసి వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల్లో కొత్త శ‌ఖాన్ని లిఖించారు జ‌గ‌న్‌. ఎనిమిది నెల‌ల‌లోనే… 5 లక్షలా 60,000 మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రికార్డ్ సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలకు.. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి రైతుల ప‌ట్ల చిత్త‌శుద్ధిని చాటుకున్నారు.

రైతుల‌కు సున్నావడ్డీ పథకాన్ని తెచ్చిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కే ద‌క్కుతుంది. మాట ఇచ్చిన దాని కంటే.. రైతు భ‌రోసా మొత్తాన్ని రూ.13500లకు పెంచి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌శ‌కితుల‌ను చేశారు. దీన్ని వ‌ల్ల ఏటా రాష్ట్రప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం ప‌డుతున్నా.. రైతు ఇంట సిరుల పంట పండించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని, ఆ దిశ‌గా ముందుకే అడుగులు వేస్తున్నారు. అధికారం చేప‌ట్టి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా.. ఈ నెల 30న 10,642 వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా

రైతుల కోసం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో కొన్నింటి ప్రస్తావన…!

* తొలి ఏడాదిలోనే రూ.10,209 కోట్లను రైతులకు అందించిన ఘ‌న‌త జ‌గన్ దే.
* రైతుల‌కు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్.
* రూ.1270 కోట్లు బీమా ప్రీమియం ప్ర‌భుత్వ‌మే చెల్లించింది.
* రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చింది.
* ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకూ రూ.49వేలు లబ్ధి చేకూరుతోంది.
* ఈ ఖరీఫ్‌ నాటికి 82శాతం ఫీడర్లలో 9గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. మిగిలిన 18 శాతం రబీనాటికి అందుబాటులోకి వస్తుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
* ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్న ఘ‌న‌త జ‌గ‌న్ దే.
* క‌రోనాతో ఏర్ప‌డ్డ క‌ష్ట‌కాలంలో రైతులు న‌ష్ట‌పోకుండా రూ.1100 కోట్లతో పంటల కొనుగోలు.
* 80,522 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయించ‌డం ద్వారా రైతుల‌కు వ్యాపార ప‌రంగా స‌హ‌కారం అందించ‌డం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.2,200 కోట్లు చెల్లించారు. రూ.12,672 కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేశారు.
* రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారా రూ.13500 పంటసాయం అందిస్తోంది.