iDreamPost
android-app
ios-app

ఎగ్జిక్యూటివ్ రాజధానికి భారీగా నిధులు

  • Published Dec 26, 2019 | 1:23 PM Updated Updated Dec 26, 2019 | 1:23 PM
ఎగ్జిక్యూటివ్ రాజధానికి భారీగా నిధులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రికరణ కూడా ఉంటుందని అశంబ్లీ వేదికగా సూచనలు చేశారు. ఈ అభిప్రాయాన్నే రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ మరియు రాజధాని నిర్మాణంపై సమగ్రమైన అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలియజేయడానికి వేసిన జి.యన్ రావు కమిటి కూడా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలను బలపరిచేలా రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో విశాఖను పరిపాలన రాజధానిగా చేయమని ఉండటంతో ఇప్పుడు అందరి చూపు విశాఖ పైన పడింది. ఇదే నవ్యాంధ్రకు నూతన రాజధాని అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ అభివృద్ది కోసం భారిగా నిధులు కేటాయిస్తు ఏడు జీవోల ద్వారా విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చెసిన జీవోల ప్రకారం విశాఖపట్నంలో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం రూ.394.50 కోట్లు కేటాయించింది. కాపులుప్పాడులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం 22.50 కోట్లు, కైలాసిగిరిలో ప్లానిటోరియం కోసం రూ.37 కోట్లు, సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ మరియు వాణిజ్య సముదాయం కోసం రూ.80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రిసెర్చ్ సంస్థ కోసం 88 కోట్లు, నాకయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాని పాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ.90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ.40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.75 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. దీంతో పరిపాలన రాజధాని ప్రాంతంగా విశాఖనే ఉంటుందనే వాదనకు బలం చేకూరినట్టు అయింది. విశాఖకు రాజధాని కళ తెప్పించే విధంగా అభివృద్ది పనులు అప్పుడే ముఖ్యమంత్రి మొదలపెటారని విశాఖ వాసులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైన రేపు జరగబొయే క్యాబినేట్ మీటింగ్ తరువాత రాజధానులపై ఒక నిర్ధిష్టమైన స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూన్నాయి.