నేటికాలం అంతా సోషల్ మీడియా నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఏం జరిగిన కూడా క్షణాల్లో తెలిసిపోతుంది. అలానే సినీ, సెలబ్రిటీలు.. తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. చాలా మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ఎన్నో వార్తలను ప్రజలకు చేరవేస్తుంటాయి. అయితే కొందరు మాత్రం ఫలాన నటుడు చనిపోయారంటూ తప్పుడు వార్తలు రాస్తుంటారు. ఇలాంటి వార్తలపై ఎందరో నటీ నటులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జబర్దస్త్ కమెడీయన్ అప్పారావు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మీ ఫేక్ వార్తలతో ఎంతో మందిని మానసికంగా చంపేశారు కదా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
జబర్దస్త్ అప్పారావు.. ఈ పేరు తెలియని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో అప్పారావు ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా మెరిశాడు. అనేక సినిమాలో నటించి.. అందరిని నవ్వించారు. అయితే ఇటీవలే కొందరు సీనియర్ నటులను బతికుండగానే చనిపోయినట్లు రాస్తున్న కొన్ని మీడియాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఫేక్ వార్తలపై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఇప్పుడు చాలా బలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో అసత్య వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మనిషి బతికుండగానే చనిపోయినట్లు వార్తలు రాశారు. అయితే మనిషి బతికుండగానే మరణించాడని చెప్పే అధికారం, హక్కు మీకుఎవరు ఇచ్చారు. ఎవరైన చనిపోవాల్సిందే. అలానే ఇలాంటి అసత్య వార్తలు రాసే వారు కూడ చనిపోవాల్సిందే. అయితే బతికుండగానే చంపేసి..మానసికంగా వేదనకు గురిచేస్తున్నారు. ఇక లింక్ ఓపెన్ చేస్తే దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. లేనిపోని వార్తలు రాసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయండి.
అందరి తరపున కోరుకుంటున్నాను.. వాస్తవాలు మాత్రమే రాయండి. బతికే ఉన్న మనిషిని చనిపోయినట్లు రాయకండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ వాళ్లందరూ ఈ మాటలు వినాలి. ఎందుకంటే.. తాను ఒక నాటిక రాద్దామనుకున్నానని, దాని పేరు యూట్యూబ్ నీకోక దండం అని అప్పారావు అన్నారు. ప్రస్తుతం అప్పారావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. జబర్దస్త్ అప్పారావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.