నిండా ముంచేసిన జాను – ముగింపు వసూళ్లు

నిర్మాతకు హీరో హీరొయిన్లకు విడుదలకు ముందు విపరీతమైన ఆశలు రేకెత్తించిన జాను ఫైనల్ రన్ కు వచ్చేసింది. తమిళ్ కల్ట్ క్లాసిక్ 96కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రిజల్ట్ మాత్రం ఒరిజినల్ కు అచ్చంగా రివర్స్ లో వచ్చింది. సుమారు 19 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న జాను క్లోజింగ్ లో కేవలం 8 కోట్లు కూడా అందుకోలేకపోవడంతో అరవై శాతం పైగా నష్టాలు తప్పలేదు.

శర్వానంద్, సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ అయినప్పటికీ ఆ క్రేజ్ కూడా పనిచేయలేదు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఏ విభాగంలో మెప్పించలేకపోయాడు. మక్కికి మక్కి దించాలన్న ప్రయత్నమే బెడిసి కొట్టింది. నత్తనడకన సాగే కథలు మనవాళ్లకు వంటబట్టవని దానికి ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా లాభం లేదని జాను నిరూపించింది. మల్టీ ప్లెక్స్ కల్చర్ బలంగా ఉండే నైజాం లాంటి ఏరియాలలోనూ జాను కేవలం రెండు కోట్ల యాభై లక్షల షేర్ రాబట్టుకుంది.

నెల్లూరులో మరీ అన్యాయంగా పాతిక లక్షలు వచ్చాయి అంతే. సీడెడ్ లో కనీసం కోటి రూపాయల షేర్ వసూలు కాలేదు. మిగిలిన ఏరియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. క్లాస్ సినిమా కాబట్టి ఓవర్సీస్ ఆడియన్స్ ఆదుకుంటారు అనుకుంటే అక్కడా తిరస్కారం తప్పలేదు. మొత్తానికి ఒక భాషలో హిట్ అయినంత మాత్రం గుడ్డిగా రీమేక్ చేయకూడదనే పాఠం జాను గట్టిగానే నేర్పించింది. ట్రేడ్ నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా  షేర్ 
నైజాం  2.5cr
సీడెడ్  0.85cr
ఉత్తరాంధ్ర  0.90cr
గుంటూరు  0.60cr
క్రిష్ణ  0.56cr
ఈస్ట్ గోదావరి  0.46cr
వెస్ట్ గోదావరి  0.35cr
నెల్లూరు  0.25cr
ఆంధ్ర+తెలంగాణా  6.47cr
కర్ణాటక + ROI  0.50cr
ఓవర్సీస్  0.60cr
ప్రపంచవ్యాప్తంగా 7.57cr

Show comments