iDreamPost
android-app
ios-app

శ్రీలీలకు ఆడియన్స్.. ఊ అంటారా? ఊహూ అంటారా?

  • Published Nov 11, 2024 | 3:17 PM Updated Updated Nov 11, 2024 | 3:17 PM

Samantha Vs Srileela: శ్రీలీల సామ్ ను మరిపిస్తుందా లేదా.. ఇదే ఇప్పుడు అందరికి పెద్ద ప్రశ్న. పుష్ప 2 సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో.. ఐటెం సాంగ్ కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూసేద్దాం.

Samantha Vs Srileela: శ్రీలీల సామ్ ను మరిపిస్తుందా లేదా.. ఇదే ఇప్పుడు అందరికి పెద్ద ప్రశ్న. పుష్ప 2 సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో.. ఐటెం సాంగ్ కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూసేద్దాం.

  • Published Nov 11, 2024 | 3:17 PMUpdated Nov 11, 2024 | 3:17 PM
శ్రీలీలకు ఆడియన్స్..  ఊ అంటారా? ఊహూ అంటారా?

సినిమా రిలీజ్ కు నెల కూడా లేదు. ఓ పక్క టీం అంతా ఇంకా షూట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఐటెం సాంగ్ కు సంబంధించిన షూట్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సాంగ్ పేరే ‘కిస్సిక్’. ఇందులో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల స్టెప్పులేస్తోంది. రెండు రోజుల క్రితం సెట్స్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది. వెంటనే మేకర్స్ కూడా అఫీషియల్ గా ఓ అప్డేట్ ఇచ్చేశారు. దీనితో ఇప్పుడు అందరికి కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. సమంతను శ్రీలీల మరిపిస్తుందా ? అనే చర్చలు జరుగుతున్నాయి. పార్ట్ 1 లో ‘ఊ అంటావా మావ.. ఊహూ అంటావా మావా’ సాంగ్ ఏ రేంజ్ లో పేలిందో తెలియనిది కాదు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియాని ఓ రేంజ్ లో ఊపేసిన పాట ఇది. సో ఇప్పుడు పార్ట్ 2 లో అంతకుమించిన సాంగ్ ను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే వారిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

పుష్ప ఐటెం సాంగ్ తో సమంత క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడింది. ఇక శ్రీలీల విషయానికొస్తే.. పలు సినిమాలు చేస్తున్నా కానీ.. ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ కు అయితే వెళ్ళలేదు. అయినా సరే గ్లామర్ , డ్యాన్స్ లతో ఫాలోవర్స్ ను పెంచుకుంది. మేకర్స్ సైతం ఆమెను ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా అంటున్నారు. ‘కిస్సిక్’ సాంగ్ డ్యాన్స్ ఫీస్ట్ , ఐ ఫీస్ట్ , మ్యూజికల్ డిలైట్ గా ఉండబోతుందని చెబుతున్నారు. నిజమే శ్రీలీల మంచి డ్యాన్సర్.. కుర్చి మడతపెట్టి సాంగ్ తో రికార్డ్స్ మడతపెట్టింది. కానీ ఈ సినిమాలో ఈ ఐటెం సాంగ్ హిట్ అవ్వాలంటే మాత్రం.. కచ్చితంగా సామ్ ను మించి డాన్స్ చేయాల్సిందే. రేపు ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక కచ్చితంగా వీరిద్దరి మధ్య కంపేరిజన్స్ వస్తాయి. ఇద్దరిలో ఎవరు డ్యాన్స్ బాగా చేశారు అనే దానికన్నా కూడా.. సాంగ్ కు తగిన ఎక్స్ ప్రెషన్స్ తో ఎవరు గ్రేస్ ఫుల్ గా వేశారు అనేదే జనాళ్ళకి వెళ్తుంది. సో మొత్తానికి ఇది శ్రీ లీలకు పెద్ద సవాల్ అని చెప్పి తీరాల్సిందే. ఇక ప్రేక్షకులు శ్రీలీల కు ఊ అంటారో ఊహూ అంటారో చూడాలి.

ఇక కిస్సిక్ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్ కంపోజ్ చేశారు ? చంద్రబోస్ ఎలాంటి లిరిక్స్ రాశారు? దానిని సుకుమార్ ఎలా మేక్ ఓవర్ చేశాడు ? ఇలా ప్రతి దానిని ఊ అంటావా తో కంపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో సమంత , శ్రీలీల ఫోటోలను పక్క పక్కన పెట్టి.. లెట్స్ వెయిట్ అంటూ పోస్ట్స్ పెడుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. ఆల్రెడీ శ్రీలేల కు గ్లామర్ ఉంది. సుకుమార్ కి తనకు కావాల్సినవి ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు. సో ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయితే మాత్రం.. శ్రీ లీల స్టెప్పులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే అవకాశం ఉంది. అటు బాలీవుడ్ కన్ను కూడా ఈ అమ్మడి మీద పడే ఛాన్స్ ఉంది. సాంగ్ రిలీజ్ అయ్యే వరకు కూడా అసలు కథ ఇదని చెప్పలేం. కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/