iDreamPost
android-app
ios-app

విశాఖ బాధితులకు భారీ ఊరట..!

విశాఖ బాధితులకు భారీ ఊరట..!

ఊహించని పెను ప్రమాదం ఎదుర్కొన్న విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు నిజంగా ఇది పెద్ద ఊరట కలిగించే వార్త ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. పరిశ్రమ నుంచి విడుదలైన స్టైరిన్ వాయువు వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోగా..దాదాపు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంపెనీ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లోని దాదాపు 15 వేలమంది ప్రజలు ఈ విష వాయువు వల్ల ప్రభావితం అయ్యారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై వేగంగా సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం భారీగా తగ్గింది. అదేవిధంగా బాధితులు వేగంగా కోరుకుంటున్నారు. అయితే ఈ ఘటన, అనంతర పరిణామాలపై ఉదయం నుంచి తీవ్ర చర్చ జరిగింది. పలు మాధ్యమాల్లో ఈ ఘటనను భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఘటనతో పోల్చారు. ఈ గ్యాస్ వల్ల ప్రభావితమైన వారికి భవిష్యత్తులో శ్వాసకోస, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయనే చర్చలు మీడియాలో సాగాయి. ఈ ప్రచారం, చర్చలు బాధితుల్లోనూ వారి బంధువుల్లో తీవ్ర ఆందోళన రేపాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉండి, వారిలో భరోసా నింపినా.. భవిష్యత్ పై ఏదో తెలియని ఆందోళన వారిలో నెలకొంది. అయితే వారిలో నెలకొన్న భయాన్ని, ఆందోళనను, అనుమానాలను పటాపంచలు చేసేలా ఎయిమ్స్ డైరెక్టర్ సందీప్ రణదీప్ గుల్జేరియా కీలక ప్రకటన చేశారు. స్టైరిన్ వాయువు విషపూరితమైనది అని చెప్పిన ఆయన అయితే దీని వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. వైద్య రంగంలో అత్యున్నత సంస్థ అయిన ఎయిమ్స్ డైరెక్టర్  ఈ ప్రకటన చేయడం వల్ల బాధితులకు ఎంతో ఊరట లభించింది. నిజంగా ఇది వారికి మంచి శుభవార్త అని చెప్పవచ్చు.