iDreamPost
android-app
ios-app

కొడుకు కూతురు అల్లుడు ముగ్గురూ ఐపీఎస్ లే.. ఆయనేమో డీజీపీ

కొడుకు కూతురు అల్లుడు ముగ్గురూ ఐపీఎస్ లే.. ఆయనేమో డీజీపీ

జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు నియమితులయ్యారు. 1987 బ్యాచ్, జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఆయన గతంలో జార్ఖండ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో పలు హోదాల్లో పనిచేశారు. ఈ నేపధ్యంలో అయన జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ గా మంగళవారం కీలక బాధ్యతలు స్వీకరించారు. దదాపు 18 నెలలపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఎంవీ రావు స్వస్థలం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక. ఆయన వరంగల్ ఆర్ఈసీ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

కాగా, ఎంవీ రావు కుటుంబంలో నలుగురు ఐపీఎస్ అధికారులు ఉండడం విశేషం. అయన కుమార్తె దీపిక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎంవీ రావు అల్లుడు విక్రాంత్ పాటిల్ విజయవాడ డీసీపీ గానూ, కుమారుడు హర్షవర్ధన్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్ లో ఏసీబీ ఎస్పీగాను పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఎంవీ రావు కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ గా నీయమితులవడం సాటి తెలుగువారందరికీ గర్వకారణం.