iDreamPost
android-app
ios-app

వన్డే పంచ్‌కు రంగం సిద్ధం

వన్డే పంచ్‌కు రంగం సిద్ధం

న్యూజిలాండ్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ–20సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంతో భారత జట్టు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. వన్డే సిరీస్‌ను గెలవాలన్న పట్టుదలతో అస్త్రశస్త్రాలు సానపడుతోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, భువనేశ్వర్‌ లాంటి క్రికెటర్లు మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది.

రేపు (బుధవారం) ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ఓపెనర్లతో ప్రయోగం చేయనుంది. టాప్‌ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయని, మిడిల్‌ ఆర్డర్‌లో రాహుల్‌ దిగుతాడని కెప్టెన్‌ కోహ్లి చెప్పారు. దీన్ని బట్టి ఓపెనర్లుగా మయాంక్‌ అగర్వాల్, యువ టాలెంట్‌ పృథ్వీ షా దిగే అవకాశం ఉంది. వరుస సూపర్‌ఓవర్లతో చివరి వరకు పట్టు విడవకుండా భారత ఆటగాళ్లు పోరాడుతున్న తీరుపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదేతీరున వన్డేల్లోనూ ఆడి చరిత్ర సృష్టించాలని కోరకుంటున్నారు.

మరోవైపు వరస ఓటములతో కుదేలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండు వన్డేలకు దూరంగా ఉండనున్నారు. దీంతో కెప్టెన్‌గా టామ్‌ లూథమ్‌ వ్యవరించనున్నాడని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. విలియమ్సన్‌ స్థానంలో చాప్‌మెన్‌ను జట్టులోకి తీసుకుంది.