దేశంలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

  • Published - 03:15 AM, Tue - 19 May 20
దేశంలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 4970 పాజిటివ్ కేసుల నిర్దారణ

దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజులో 4970 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,139 కు చేరింది. కాగా కరోనా కారణంగా 3,156 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజులో 134 మంది మరణించారు.  కరోనా వైరస్ బారినుండి 39,233 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 58,747 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2005 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. నిన్న ఒక్కరోజులోనే 2005 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో ఒక రాష్ట్రంలో ఓకేరోజు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇది రెండోసారి. మహారాష్ట్రలో 35,058 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 51 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,249 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 21,335 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. గడచిన 24 గంటల్లో 1185 కరోనా పాజిటివ్ కేసులు ముంబయిలో నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 757 గా నమోదయింది.

తెలంగాణలో నిన్న కొత్తగా  41 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 1592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 556 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1002 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 34 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 52 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2432 కి మందికి కరోనా సోకగా, 50 మంది మృత్యువాత పడ్డారు. 1,552 మంది వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 830 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,893,260 మందికి కోవిడ్ 19 సోకగా 320,173 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,907,990 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,550,294 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 91,981 మంది మరణించారు.

Show comments