iDreamPost
android-app
ios-app

బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు భారత రత్న!.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

Ratan Tata: రతన్ టాటాకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రి వర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.

Ratan Tata: రతన్ టాటాకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రి వర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.

బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు భారత రత్న!.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన

బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్ని కన్నుమూశారు. ఆయన మరణంతో యావత్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ, బిజినెస్ రంగాల్లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగంలో సాటిలేని వ్యక్తి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయ ఢంకా మోగించారు. టాటా కంపెనీ సక్సెస్ లో విశేషమైన కృషి చేశారు. ఆటోమోబైల్, సాప్ట్ వేర్, టెలికాం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వాటిని విజయ తీరాలకు చేర్చే వరకు అలుపెరుగని పోరాటం చేశారు. దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. వ్యాపార సామ్రాజ్యంలో అందనంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం అతని సొంతం. నిరాడంబరంగా జీవించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది.

కొంచెం పేరొస్తేనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. విలాసవంతమైన భవనాలు, కోట్లు విలువ చేసే కార్లు ఇలా ప్రతీది రిచ్ గా ఉండాలనుకుంటారు. కానీ రతన్ టాటా లగ్జరీ లైఫ్ కు ఆమడ దూరంలో ఉన్నారు. ఏనాడు విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. సంపన్న కుటుంబంలో పుట్టినా సామాన్య జీవితాన్నే గడిపారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన రతన్ టాటా ఏనాడూ కుబేరులతో కలిసి కనిపించకపోవడం గమనార్హం. అందుకే రతన్ టాటా కోట్లాది మంది హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్ తలెత్తింది.

సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు సైతం డిమాండ్ లేవనెత్తారు. కానీ, అది ముందుకు పడలేదు. ఇప్పుడు రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. టాటాకు భారత రత్న ప్రధానం చేయాలని కోరుతూ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రి వర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాల్లో రతన్ టాటా సేవలు మరువలేనివని కొనియాడారు. టాటా మృతికి గౌరవ సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది.

కాగా ముంబైలోని ఎన్ సీపీలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్దఎత్తున ప్రముఖులు, ప్రజలు తరలివస్తున్నారు. కాగా రతన్ టాటా దేశాభివృద్ధి, సంపద పెరగడంలో తన వంతు సహకారాన్ని అందించారు. ఆయన చేసిన సేవలకు గాను రతన్ టాటాకు 2008లోనే పద్మవిభూషన్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మరి రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.