Bollywood దిక్కుతోచని స్థితిలో బాలీవుడ్ సినిమా

లాల్ సింగ్ చడ్డా 180 కోట్ల బడ్జెట్ తో కనీసం 50 కోట్ల మార్క్ చేరడమే కష్టమనేలా ఉంది. రక్షా బంధన్ ని 110 కోట్లకు డీల్ చేస్తే 40 కోట్లకే నానా తంటాలు పడుతోంది. నేషనల్ హాలిడే రోజైన ఇండిపెండెన్స్ డేకి చాలా చోట్ల వీటికి షోలు క్యాన్సిల్ కావడమనేది ఘోర అవమానం.

లాల్ సింగ్ చడ్డా 180 కోట్ల బడ్జెట్ తో కనీసం 50 కోట్ల మార్క్ చేరడమే కష్టమనేలా ఉంది. రక్షా బంధన్ ని 110 కోట్లకు డీల్ చేస్తే 40 కోట్లకే నానా తంటాలు పడుతోంది. నేషనల్ హాలిడే రోజైన ఇండిపెండెన్స్ డేకి చాలా చోట్ల వీటికి షోలు క్యాన్సిల్ కావడమనేది ఘోర అవమానం.

ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ చాలా గడ్డు పరిస్థితిని ఎదురుకుంటోంది. ఒకప్పుడు దేశమంతా తలెత్తి చూసేలా సినిమాలు తీసిన అక్కడి దర్శక నిర్మాతలు సౌత్ తో పోటీ పడలేక ఎలాంటివి తీస్తే జనం ఆదరిస్తారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. లాల్ సింగ్ చడ్డా 180 కోట్ల బడ్జెట్ తో కనీసం 50 కోట్ల మార్క్ చేరడమే కష్టమనేలా ఉంది. రక్షా బంధన్ ని 110 కోట్లకు డీల్ చేస్తే 40 కోట్లకే నానా తంటాలు పడుతోంది. నేషనల్ హాలిడే రోజైన ఇండిపెండెన్స్ డేకి చాలా చోట్ల వీటికి షోలు క్యాన్సిల్ కావడమనేది ఘోర అవమానం. అందులోనూ అమీర్ ఖాన్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇక అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్విరాజ్ తర్వాత జనం ఇచ్చిన మరో కానుక ఇది.


కార్తికేయ 2 చూస్తే మొదటి రోజు 60 స్క్రీన్లతో నార్త్ లో మొదలుపెడితే ఇప్పుడు వెయ్యికి దగ్గరలో ఉంది. ఈ శుక్రవారం నుంచి ఊహించని స్థాయిలో వీటిని పెంచబోతున్నారని టాక్. కోటి రూపాయల కలెక్షన్ కూడా దాటేసింది. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్పల తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకుంది ఈ మూవీనేనని అక్కడి విశ్లేషకుల మాట. నిజానికి కరోనా తర్వాత ఏర్పడిన స్లంప్ హిందీ మేకర్స్ ని వదలడం లేదు. దానికి తోడు ఓటిటి, డిజిటల్ లో ఎంత వస్తుంది, వాటి ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారనే దాని మీద పెడుతున్న శ్రద్ధ బిసి సెంటర్ జనాల కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి ఆలోచించడం లేదు. అదే ఇప్పటి దుస్థితికి కారణం.

దీనికి అంతమెక్కడో ఎవరికీ తెలియదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోల సినిమాలు వచ్చి రెండేళ్లు దాటుతోంది. అమీర్ ఖాన్ చూస్తేనేమో మన ఆడియన్స్ కి ఏ మాత్రం సూటయ్యే అవకాశం లేని ఫారెస్ట్ గంప్ రీమేక్ తీసుకొచ్చి రుద్దేశాడు. పబ్లిక్ కూడా రెట్టింపు స్థాయిలో రిజెక్ట్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్యా 2, గంగూబాయ్ కటియావాడి తప్ప 2022లో బాలీవుడ్ హిట్స్ లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. 2023 జనవరి చివర్లో షారుఖ్ ఖాన్ పఠాన్ వస్తుంది. అప్పటిదాకా ఈ సిచువేషన్ లో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. అయినా ఎంతసేపూ అర్బన్ డ్రామాలతో కాలక్షేపం చేస్తే మాస్ థియేటర్లకు ఎందుకు వస్తారు. బాలీవుడ్ సెల్ఫ్ గోల్ ఇది.

Show comments