iDreamPost
android-app
ios-app

సుశాంత్ మరణించిన ఇంట్లోకి షిఫ్లైన అదా శర్మ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

  • Published Oct 15, 2024 | 6:00 PM Updated Updated Oct 15, 2024 | 6:00 PM

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఇంటిని కొనుగోలు చేసింది ప్రముఖ నటి అదా శర్మ. వద్దు ఆ ఇల్లు కొనొద్దని చెప్పినా.. వినిపించుకోకుండా ఆ ఇంట్లోకి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యింది. కాగా, ఇప్పుడు పలు కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఇంటిని కొనుగోలు చేసింది ప్రముఖ నటి అదా శర్మ. వద్దు ఆ ఇల్లు కొనొద్దని చెప్పినా.. వినిపించుకోకుండా ఆ ఇంట్లోకి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యింది. కాగా, ఇప్పుడు పలు కామెంట్స్ చేసింది.

  • Published Oct 15, 2024 | 6:00 PMUpdated Oct 15, 2024 | 6:00 PM
సుశాంత్ మరణించిన ఇంట్లోకి షిఫ్లైన అదా శర్మ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని హిందీ ఇండస్ట్రీనే కాదు.. మిగిలిన ఏ సినీ పరిశ్రమ మర్చిపోదు. స్టార్ హీరోగా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 జూన్ 14న అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని కనిపించాడు. అతడి సూసైడ్ సంచలనం అయ్యింది. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని కొందరు వాదించారు. ఏదీ ఏమైనా ఇది హత్యా లేక ఆత్మహత్యా అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సుశాంత్ మరణించాక.. అతడి ఇంట్లో రెంట్ ఉండేందుకు కూడా చాలా మంది భయపడ్డారు. అలాంటిది ఆ ఇంటిని డేర్ చేసి కొనుగోలు చేసింది బాలీవుడ్, టాలీవుడ్ నటి అదాశర్మ. ఈ విషయం తెలిసిన కొంత మంది సన్నిహితులు ఆ ఇల్లు కొనద్దని, కొన్నా అక్కడ ఉండొద్దని ఆమెకు సలహాలు సూచనలు చేశారు. కానీ వాటినేమీ కేర్ చేయలేదు అదా. ఆ ఇంటిని రీమోడలింగ్ చేయించడమే కాకుండా.. ఇప్పుడు అదే ఇంట్లోకి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యింది బ్యూటీ.

తన అమ్మ, అమ్మమ్మతో కలిసి అదే ఇంట్లో ఉంటుంది. కాగా, ఈ ఇంట్లో మారడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది అదా శర్మ. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నాకు ఈ ఇల్లు ఎంతో నచ్చింది. మా ఫ్యామిలీతో అక్కడ ఉంటున్నాను. అక్కడ ఏదో శక్తి ఉంది. ఇక్కడ చెట్టు ఎక్కువగా ఉంటాయి.  పక్షులు, వాటికి ఆహారం పెట్టేందుకు అనువైన స్థలం ఉంది. అందుకే ఈ ఇంటికి కొన్నాను. నటిగా, ఓ వ్యక్తిగా, ప్రతి అంశంపై స్పందించాల్సిన అవసరం లేదు. జీవితంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది స్వేచ్ఛాయుత దేశం. ప్రతి ఒక్కరికీ అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కు ఉంది. నేను తీసుకునే నిర్ణయాలు ప్రజలకు వివరించాలని అనుకోవడం లేదు. నేను మంచి వ్యక్తిని రుజువు చేసుకోవాల్సిన పని లేదు. అలాగే నా చర్యలకు కారణాలు చెప్పేందుకు ఇక్కడ లేను. నా కోసం ఎవరూ మారకూడదని నేను కోరుకున్నట్లే.. నేను కూడా నన్ను నేను మార్చుకోను. నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం. ఇక్కడే ఉంటా’ అంటూ తన నిర్ణయాన్ని కఠినంగానే చెప్పేసింది.

ఇప్పుడే కాదు.. గతంలో కూడా సుశాంత్ ఇంట్లో ఉండొద్దు అంటూ అదాశర్మకు హితవు పలికారు. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. అప్పుడు కూడా పలు రూమర్లను తోసిపుచ్చిన ఈ హార్ట్ ఎటాక్ బ్యూటీ.. ఇంటిని రీమోడల్ చేయించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆ హౌస్‌లోకే షిఫ్ట్ అయ్యింది. చాలా మంది లైఫ్ రిస్క్‌లో పెట్టుకోవడం అవసరమా అంటూ సలహాలు సూచనలు ఇచ్చినా కూడా ఆ ఇల్లు నచ్చింది.. అందుకే ఉంటున్నానంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. ఇక అదాశర్మ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది వచ్చిన కేరళ స్టోరీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. మరో కాంట్రవర్సీ మూవీ బస్తర్ చిత్రంలో వచ్చింది. ఇది బాక్సాఫీసు దగ్గర అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ద గేమ్ ఆఫ్ గిర్గిత్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో ఉండాలని అదా తీసుకున్న నిర్ణయం సరైనదేనంటారా..? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş