iDreamPost
iDreamPost
విశ్వక్ సేన్ హీరోగా న్యాచురల్ స్టార్ నిర్మాతగా రూపొందిన హిట్ మూడు రోజుల ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ మిక్స్డ్ గానే ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఇంకో ఆప్షన్ లేకపోవడంతో క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు హిట్ కే ఓటు వేస్తున్నారు. మొదటి మూడు రోజులను చక్కగా వాడుకున్న హిట్ జరిగిన బిజినెస్ లెక్కల్లో చూసుకుంటే డీసెంట్ గానే రాబట్టుకుంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు హిట్ ఇప్పటిదాకా 3 కోట్ల 17 లక్షల షేర్ రాబట్టింది. ఇందులోనూ నైజాం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక్క ఆ ఏరియా నుంచే 1 కోటి 60 లక్షలు వచ్చాయి . సీడెడ్ లాంటి ప్రాంతాల్లో హిట్ రన్ మరీ నెమ్మదిగా ఉంది. అక్కడవసూలయ్యింది కేవలం 30 లక్షలు మాత్రమె. నెల్లూరు నుంచి కేవలం 9 లక్షలే వచ్చాయి. ఉత్తరాంధ్ర, గుంటూర్, కృష్ణా జిల్లాల వరకు పర్వాలేదు అనిపించింది కాని మరీ గొప్పగా అయితే లేవు. హిట్ రెండో వారంలోకి అడుగు పెట్టే లోపు బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందా లేదా అనే దాని మీదే ట్రేడ్ దృష్టి ఉంది.
ఒకవేళ థియేట్రికల్ బిజినెస్ కనక 10 కోట్ల రేషియోలో కనక జరిగి ఉంటె ఖచ్చితంగా డిజాస్టర్ ముద్ర పడేది. చాలా రీజనబుల్ రేట్లకు హిట్ ని ఇవ్వడం బాగా ప్లస్ అవుతోంది. 5 కోట్లు భారీ టార్గెట్ కాదు కాబట్టి కొంచెం స్టడీగా ఉంటే అది అసాధ్యం కాదు. సింగల్ పాయింట్ మీద నడిచే థ్రిల్లర్ కావడంతో మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ కి దూరంగా ఉన్నారు . ఒకవేళ వాళ్ళ మద్దతు దొరికి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మొత్తానికి హిట్ డీసెంట్ గానే వీకెండ్ ని పూర్తి చేసింది. ఇకపై ఎలా నిలుస్తుందనేదే కీలకం. ఏరియాల వారిగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
AREA | SHARE |
నైజాం | 1.60cr |
సీడెడ్ | 0.30cr |
ఉత్తరాంధ్ర | 0.34cr |
గుంటూరు | 0.25cr |
క్రిష్ణ | 0.26cr |
ఈస్ట్ గోదావరి | 0.15cr |
వెస్ట్ గోదావరి | 0.18cr |
నెల్లూరు | 0.09cr |
Total Ap/Tg | 3.17cr |