iDreamPost
android-app
ios-app

Balakrishna: బాలయ్య మూవీలో విశ్వక్ సేన్? థియేటర్లు దద్దరిల్లడం ఖాయం..

  • Published Sep 16, 2024 | 10:06 AM Updated Updated Sep 16, 2024 | 10:06 AM

Vishwak Sen cameo role in Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ మూవీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ 2లో విశ్వక్ క్యామియో చేస్తున్నట్లు సమాచారం.

Vishwak Sen cameo role in Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ మూవీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ 2లో విశ్వక్ క్యామియో చేస్తున్నట్లు సమాచారం.

  • Published Sep 16, 2024 | 10:06 AMUpdated Sep 16, 2024 | 10:06 AM
Balakrishna: బాలయ్య మూవీలో విశ్వక్ సేన్? థియేటర్లు దద్దరిల్లడం ఖాయం..

నందమూరి బాలకృష్ణ.. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ.. యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ బ్లాస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అఖండ 2లో యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్నాడట. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ కు టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. సింహా దగ్గర నుంచి అఖండ వరకు సూపర్ హిట్ చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి. ఇక ఇప్పుడు అఖండ 2 రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు? అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అడుగుతున్నారు. అయితే షూటింగ్ విషయం తెలీదు కానీ.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వెలుగులోకి వచ్చింది. అఖండ 2లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడట. ఈ మూవీలో ఓ పవర్ ఫుల్ రోల్ ను క్రియేట్ చేశాడట బోయపాటి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి.. విశ్వక్ కోసం ఓ పాత్రను సృష్టించినట్లు సమాచారం. సెకండాఫ్ లో విశ్వక్ పాత్ర వస్తుందని టాక్.

కాగా.. బాలయ్య మూవీలో విశ్వక్ నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు. విశ్వక్ కు బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య మూవీలో విశ్వక్ నటించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మూవీలో నటించమని ఆయన అడగాలే గానీ.. ఈ యంగ్ హీరో కాదనే ఛాన్సే లేదు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరు వెండితెరపై కనిపిస్తే.. థియేటర్లలు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఇలా ఇతర హీరోల సినిమాల్లో మరో హీరో నటించడం అనేది కామన్ గా మారింది. కాగా.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరి వీరిద్దరిని కలిసి స్క్రీన్ పై చూడాలని ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş