వీడియో: సినిమా స్టైల్లో హైవే మీద బంగారం దోపిడి!

వీడియో: సినిమా స్టైల్లో హైవే మీద బంగారం దోపిడి!

ఇటీవల కాలంలో ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కేవారి సంఖ్య ఎక్కువైంది. ముఖ్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నావారు రోజు రోజూకు పెరిగి పోతున్నారు. కష్టపడి సంపాదించుకోవడం చేతకాక, ఇతరులు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును దోచుకెళ్తున్నారు. ఈ చోరీలకు పాల్పడుతున్న వారిలో యువత కూడా ఉండటం మన దురదృష్టకరం. చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు, దేశానికి భరోసాగా ఉండాల్సిన యువకుల్లోని కొందరు ఇలా చెడు మార్గాల వైపు వెళ్తున్నారు. తాజాగా పట్టుమని పాతికేళ్లు లేని యువకులు.. సినిమా స్టైల్లో బంగారాన్ని దోపిడి చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో తిరువళ్లూరు జాతీయ రహదారిపై బంగారం చోరీ జరిగింది.  జ్యూవలరీ షాపు యజమాని  ఒకరు కిలో బంగారం తీసుకుని  ఊరికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో బంగారంతో వెళ్తున్న వాహనం కాస్తా దూరం వెళ్లాక.. ఆరుగురు యువకులు అడ్డగించారు. అంతేకాక తమ వెంట తెచ్చుకున్న తల్వార్లతో ఆ వాహనంలోని వారిని బెదిరించారు. వాహనంలోని కిలో బంగారం తీసుకుని, యజమానిపై దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అంత ఎంతో సమయం జరిగిదనుకుంటే మీరు పొరపడినట్లే.. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తమ టార్గెట్ ను పూర్తి చేశారు ఆ దొంగలు.

ఇక ఈ దోపిడి జరుగుతున్నప్పుడు అటుగా వెళ్తున్న వాహనాల్లోని వారు ఎవరు.. ఆ దొంగలను ఆపే ప్రయత్నం చేయలేదు. వారి చేతుల్లో పెద్ద పెద్ద తల్వార్లు ఉండటంతో ఎదిరించేందుకు స్థానికులు, వాహనదారులు బయపడ్డారు. అయితే బంగారు షాపు యజమాని వాహనం వెనుక వెళ్తున్న ఓ కారు డ్యాష్ బోర్డులోని కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు  రికార్డయ్యాయి. బంగారం యజమానిని.. దొంగలు కత్తులతో బెదిరిస్తున్న తరుణంలో.. వెనుక  ఉన్న కారు డ్రైవర్.. వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ వారు క్షణాల్లోనే దొంగతనం చేయడం.. అక్కడి నుంచి పారిపోయవడం చేయడంతో.. అతడు ముందుకే వెళ్లాడు.

ఇక బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే దొంగలను పట్టుకున్నారు. పట్టుబడిన వారందరూ 25 ఏళ్ల లోపు యువకులే కావడం గమన్హరం. వీరి మాదిరే కొందరు చదువులు సక్కగా చదవక, ఇలా జూలాయిగా తిరగడానికి అలావాటు పడి.. దొంగతనాలకు పాల్పడుతుంటారని స్థానికులు అంటున్నారు. మరి.. పట్టుమని పాతికేళ్లు లేని యువకులు ఇలా చెడు మార్గంలో వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో మరోసారి హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్

Show comments