iDreamPost
android-app
ios-app

తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్..!

  • Published Nov 06, 2023 | 6:26 PM Updated Updated Nov 06, 2023 | 6:26 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ ఇంట డబుల్ ధమాకాలా .. అటు మనవరాలు రాక, కోడలి ప్రవేశం జరిగాయి. రామ్ చరణ్,ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనిచ్చారు. వరుణ్- లావణ్యలకు పెళ్లి పీటలు ఎక్కారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ ఇంట డబుల్ ధమాకాలా .. అటు మనవరాలు రాక, కోడలి ప్రవేశం జరిగాయి. రామ్ చరణ్,ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనిచ్చారు. వరుణ్- లావణ్యలకు పెళ్లి పీటలు ఎక్కారు.

  • Published Nov 06, 2023 | 6:26 PMUpdated Nov 06, 2023 | 6:26 PM
తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్..!

సినీ పరిశ్రమ నుండి శుభవార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా నటి లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి పీటలు ఎక్కాడు యంగ్ టాలెంట్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్. రక్షితా రెడ్డిని వివాహం చేసుకుని.. బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు వీరి ఇంటి నుండి మరో శుభవార్త రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే మన శర్వానంద్ తండ్రిగా ప్రమోట్ కాబోతున్నాడట.

చిన్న సినిమాలతో సత్తా చాటాడు శర్వానంద్. తొలుత తమ్మడు క్యారెక్టర్లు చేశాడు. సంక్రాంతి, లక్ష్మి, శంకర్ దాదా ఎంబీబీఎస్, గౌరీ, క్లాస్ మేట్స్ వంటి పిక్చర్స్‌లో చిన్న రోల్స్‌లో నటించిన శర్వా.. గమ్యం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ నుండి అసలు, సిసలైన సినీ కెరీర్ ప్రారంభమైంది. అటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడపా దడపా సినిమాలు చేశాడు. తెలుగులో బ్రేక్ ఇవ్వకుండా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గమ్యం తర్వాత పలు సినిమాల విషయంలో తడబడ్డ శర్వాను నిలబెట్టిన సినిమా ప్రస్థానం. అతడికి మస్తు క్రేజ్ తెచ్చి.. కెరీర్‎కు బూస్ట్ ఇచ్చింది. తర్వాత జర్నీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రన్ రాజా రన్ హిట్ మూవీగా నిలవగా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రం ఫీల్ గుడ్‌గా నిలిచింది.

ఎక్స్ ప్రెస్ రాజా, రాజాధి రాజా బెడిసి కొట్టగా.. శతమానం భవతితో డీసెంట్ హిట్ ఇచ్చాడు. మళ్లీ ఫాంలోకి వచ్చారు అనుకుంటుండగా.. రాధా అనే మూవీ అట్లా వచ్చి ఇట్లా పోయింది. అక్కడ నుండి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి విజయాలు నమోదు చేసినవి చాలా తక్కువ. అయితే గత ఏడాది ఒకే ఒక జీవితం అతడిని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు ఆయన శ్రీరామ్ ఆదిత్య మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అతడు భార్యతో కలిసి అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షితా, శర్వానంద్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అఫీషియల్ ఎన్సౌన్ రావాల్సి ఉంది. రక్షితా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందున.. అక్కడికి, ఇండియాకు తిరుగుతున్నారట శర్వా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş