ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు అరెస్టు, రాజమండ్రి జైలుకు వెళ్లడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ లో అవినీతికి పాల్పడ్డారని ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆదివారం విచారణ సందర్భంగా కోర్టులో వాడీవేడి వాదనలు కూడా జరిగాయి. చివరకు రిమాండ్ విధిస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్ కేవలం టీడీపీపైనే కాకుండా వారి హెరిటేజ్ సంస్థపై కూడ తీవ్ర ప్రభావం చూపిందని టాక్ వినిపిస్తోంది.
నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్..టీడీపీ పై ఎంతగానో ప్రభావం చూపించి. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్ అనేది.. ఆయన ప్రారంభించిన హెరిటేజ్ పై కూడ ప్రభావం చూపిందని వార్తలు వస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే షేర్లు ఒక్కసారిగా పడిపోయినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కొక్క హెరిటేజ్ షేర్ ధర రూ. 257 .90 ల వద్ద ట్రేడింగ్ స్టార్ట్ కాగా… రూ. 253 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసినట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్క రోజే ఆరు శాతానికిపైగా పడిపోగా మంగళవారానికి అది 11.78 శాతానికి పడిపోయింది.
ఇక ఇవాళ రూ. 253 వద్ద స్టార్ట్ కాగా సాయంత్రానికి రూ. 221 .45 వద్ద ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ షేర్లను ప్రస్తుత పరిస్థితుల్లో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. కొద్దిరోజులు ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉంటాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు. ఇక హెరిటేడ్ విషయానికి వస్తే.. 1992లో ఇది ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతోన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నారా భువనేశ్వరి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కొనసాగుతున్నారు. మరి.. చంద్రబాబు అరెస్ట్ తో హెరిటేజ్ షేర్లు పడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.