iDreamPost

APS RTC బంపరాఫర్.. ఆ రూట్ లో ప్రయాణికులు బహుమతుల స్కీం..

APS RTC బంపరాఫర్.. ఆ రూట్ లో ప్రయాణికులు బహుమతుల స్కీం..

సామాన్యులకు ఆర్టీసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంతేకాక ప్రయాణికుల కోసం అనేక రకాల సౌకర్యాలను, రాయితీలను, ఆఫర్లను ఇస్తుంటుంది. మహిళలకు, వృద్ధులకు పలు రకాల రాయితీలను కల్పిస్తుంది. అలానే ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు తరచూ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తుంది. పలు రూట్లలో ఆదాయం పెంచుకునేందుకు బహుమతుల స్కీమ్ ప్రకటిస్తుంది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ప్రతి నెలా రెండు రోజుల పాటూ ప్రయాణికులకు గిఫ్ట్‌లను అందజేస్తారు. అయితే రాష్ట్రమంతట మాత్రం కాదండోయే. కేవలం నంద్యాల జిల్లాలోనే  కొన్ని రూట్లలో మాత్రమే. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

నంద్యాల జిల్లా నందికొట్కూరు డిపోలో ఈ  బహుమతుల స్కీమ్ ప్రకటించింది. కొత్తగా కర్నూలు రూట్‌లో నడుస్తున్న నాన్‌స్టాప్‌ బస్సులలో గిప్ట్‌ స్కీం ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ కు సంబంధించిన వివరాలను డీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రయాణికులకు మరింత చేరువ దిశగా ఈ స్కీమ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే సర్వీసుల ఆదాయం పెంచేందుకు కూడా  స్కీమ్ ఉపయోగ పడుతుందని అన్నారు. నందికొట్కూరు నుంచి కర్నూలు మార్గంలో ప్రయాణించే వారికి  స్కీమ్ ప్రారంభించారు. ప్రయాణికుల వారి ప్రయాణం తరువాత టిక్కెట్‌ వెనుక వారి వివరాలు రాసి నాన్‌స్టాప్‌ బస్సులలో ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ స్కీం బాక్సులలో వేయాలని అధికారులు సూచించారు.

ఈ గిఫ్ట్‌ స్కీం బాక్సులు ప్రతి నెలా రెండు సార్లు ఓపెన్ చేసి..లక్కీ డ్రా తీస్తారు. ప్రతినెల 8, 23వ తేదీల్లో ఓపెన్‌చేసి మూడు టిక్కెట్లను లక్కీ డీప్ తీసి.. 1,2,3 బహుమతులను ప్రయాణికులకు అందజేస్తామన్నారు. ఈ స్కీంలో భాగంగా మొదటి సారి నందికొట్కూరు బస్ స్టేషన్‌లో ప్రయాణికుల సమక్షంలో మూడు టిక్కెట్లు డిప్‌తీశారు మొదటి బహుమతి తరిగోపుల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, రెండవ బహుమతి కె.గోపాల్‌, మూడవ బహుమతి బీ రాఘవేంద్రరెడ్డి లకు బహుమతులు గెల్చుకున్నారు. వారు గెల్చుకున గిఫ్ట్ లను అధికారులు అందజేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ స్కీంను ఉపయోగించుకోవాలని సూచించారు డిపో మేనేజర్ తెలిపారు. మరి. నందికొట్కూరు డిపో తీసుకొచ్చిన ఈ స్కీంపై మీ అభిప్కాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి