iDreamPost
android-app
ios-app

Rangasthalam : భారీ స్కెచ్చుతో పాత సినిమాకు పబ్లిసిటీ

  • Published Jan 21, 2022 | 4:59 AM Updated Updated Jan 21, 2022 | 4:59 AM
Rangasthalam : భారీ స్కెచ్చుతో పాత సినిమాకు పబ్లిసిటీ

హిందీలో కొత్త ట్రెండ్ మొదలైంది. పుష్ప పార్ట్ 1 సక్సెస్ చూశాక నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు మాస్ సినిమా సత్తా ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వచ్చేసింది. అందుకే అల వైకుంఠపురములోని టైటిల్ మార్చకుండా మరీ డబ్బింగ్ చేసి ఈ నెల 26న థియేటర్లలో వదలబోతున్నారు. నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ దీని మీద గట్టి ఆశలే పెట్టుకుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు రంగస్థలంతో భారీ స్కెచ్ వేశారు. ఫిబ్రవరిలో దీన్ని కూడా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కంటెంట్ ఖచ్చితంగా జనాన్ని హాళ్ల వద్దకు తీసుకువస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.

సో ఆర్ఆర్ఆర్ కన్నా ముందే రామ్ చరణ్ విశ్వరూపాన్ని ఉత్తరాది ప్రేక్షకులు వెండితెరపై చూడబోతున్నారు. కరోనా ఆంక్షల వల్ల ఇప్పటికీ బాలీవుడ్ సినిమాల కొత్త రిలీజ్ డేట్లు బయటికి రావడం లేదు. ఈ కారణంగానే 83 ఎంత ఫ్లాప్ అయినా చాలా చోట్ల బలవంతంగా నెట్టుకొస్తున్నారు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కి నెల రోజులకు పైగా రన్ ఈ పరిణామాల వల్లే దక్కిందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కంటెంట్ ఫీడింగ్ కోసం డబ్బింగ్ సినిమాలు వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని, ఒకవేళ ఇలా చేయకపోతే థియేటర్లను స్వచ్చందంగా మూసివేసే రోజు దగ్గరలో ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రంగస్థలం ప్రమోషన్ కోసం భారీ స్కెచ్చును సిద్ధం చేశారు. పుష్ప దర్శకుడు ఆర్ఆర్ఆర్ హీరో కాంబినేషన్ లో వచ్చిన సినిమాగా దీన్ని పబ్లిసిటీ చేయబోతున్నారు . సోషల్ మీడియాలో కొందరు తాజాగా ఒరిజినల్ వెర్షన్ చూసేసి పొగడ్తల వర్షం కురిపిస్తుండటంతో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. మితిమీరిన ఆధునిక జీవన శైలి మీద తప్ప బాలీవుడ్ మాస్ ని టార్గెట్ చేసుకుని సినిమాలు తీయడం ఎప్పుడో మర్చిపోయిందని అందుకే సౌత్ మూవీస్ కోసం జనం ఇంతగా తహతహలాడిపోతున్నారని గోల్డ్ మైన్స్ అధినేత అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే మన పాన్ ఇండియా సినిమాల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టే

Also Read : OTT Premiers : థియేటర్లకు వెళ్లకపోయినా వినోదానికి లోటు లేదు