Dharani
టీడీపీ-జననేస ప్రకటించిన లిస్ట్‌పై మాజీ మంత్రి హరిమాయ్యజోగయ్య ఫైర్ అయ్యారు. ఇదేనా పొత్తు ధరం అని పప్రశ్నించారు.
టీడీపీ-జననేస ప్రకటించిన లిస్ట్‌పై మాజీ మంత్రి హరిమాయ్యజోగయ్య ఫైర్ అయ్యారు. ఇదేనా పొత్తు ధరం అని పప్రశ్నించారు.
Dharani
టీడీపీ జనసేన తొలి జాబితాపై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. తెలుగుదేశం సంగతి పక్కకు పెడితే.. పవన్ పార్టీకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, ఆస్తులు అమ్ముకుని మరి పార్టీ కోసం కష్టపడిన వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ తీరుపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం అంశంలో పవన్ తీరును ఎండగడుతూ.. బహిరంగ లేఖ రాశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటీ.. ఆ పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా ఉందా అని ప్రశ్నించారు.
జనసేన శక్తిని పవన్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారని.. 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని.. రాజ్యాధికారంలో వాళ్లు జనసేన వాటా కోరుకుంటున్నారని హరిరామజోగయ్య లేఖలో చెప్పుకొచ్చారు. హరిరామయ్య జోగయ్య రాసిన లేఖలో.. ‘జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా.. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా’’ అని ప్రశ్నించారు
పంపకం జరిగిన 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కావులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు ఇచ్చారని.. ఏ ప్రాతిపదికన ఈ సీట్ల పంపకం జరిగిందని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా చూసుకుంటే బీసీలకు 50 శాతం, కాపులకు 25 శాతం, కమ్మలకు 4 శాతం, రెడ్లకు 6 శాతం సీట్లు దక్కాల్సి ఉంటుందన్నారు. మరి అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు జన సైనికుల సంతృప్తి మీద జరిగాయా అంటూ హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు,
అయినా ఒకరు ఇవ్వటం, మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ హరిరామజోగయ్య తను రాసిన లేఖలో ప్రశ్నించారు. సీట్ల పంపకంలో తెలుగుదేశం యివ్వటం, చేయి జాచి జనసేన తీసుకోవటం ఏమిటి.. అంటూ ఘాటుగా విమర్శించారు. జనసేనపార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా.. ఆ పార్టీ అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈపంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా.. అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జనసేనకు 50 నుంచి 60 సీట్లు దక్కాల్సిందన్న హరిరామ జోగయ్య.. ఆ మేరకు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను కూడా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఆయా నియోజకవర్గాలలో వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడ ప్రకటించటం జరిగిందని అన్నారు.