iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. అన్నీ సవ్యంగా ఉండి ఈ కరోనా థర్డ్ వేవ్ లేకపోయి ఉంటే ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉండేది కానీ ఇప్పుడీ మహమ్మారి బ్రేకులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తాలూకు చిత్రీకరణ ఈ జనవరిలోనే పెట్టుకున్నారు. సంతకం చేసేటప్పుడు తన కాల్ షీట్స్ అందుబాటు గురించి చెక్ చేసుకుని మరీ సల్లు భాయ్ డేట్స్ ఇచ్చారట. ఇప్పుడు ఆయన వస్తే కానీ ముఖ్యమైన ఆ భాగం షూట్ చేయడం కుదరదు.
దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇది అనుకున్న టైంకే పూర్తవుతుందా లేదానే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో చాలా సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఒకరు కోలుకుంటే అయిదుగురు పాజిటివ్ వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. ఇదంతా బయట తిరగడం వల్ల, షూటింగ్ లో పాల్గొనడం వల్ల జరిగిన ప్రభావమే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రిస్క్ చేసి ఇంత దూరం హైదరాబాద్ వచ్చి షూట్ లో పాల్గొంటారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఎలాంటి మార్పు లేదట. లూసిఫర్ మలయాళం దాటి బయటకి పెద్దగా వెళ్ళలేదు కాబట్టి గాడ్ ఫాదర్ ని పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
దానికి సల్మాన్ రోల్ ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ పోషించిన ఈ క్యారెక్టర్ సినిమా చివరి అరగంటలో వస్తుంది. హీరో కాంబినేషన్ లో విలన్లతో ఒక ఫైట్ కూడా ఉంటుంది. అవన్నీ ఒకేసారి పూర్తి చేయబోతున్నారు మోహన్ రాజా. రంజాన్ పండగ సందర్భంగా రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఆ డేట్ కి రీచ్ అవుతారా అనే నమ్మకం తగ్గిపోతోంది. ఒకపక్క ఆచార్య ఫిబ్రవరి 4 నుంచి తప్పుకోవడం దాదాపు ఖరారే. అదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుంది. అంటే వేసవిలో. అలాంటప్పుడు గాడ్ ఫాదర్ రావడం అసాధ్యం. 2022లో కూడా కరోనా పీడ వదలకపోవడమే ఈ వైపరిత్యాలకు కారణం
Also Read : Acharya : ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా ఎప్పుడో