iDreamPost
android-app
ios-app

సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులపై తదుపరి విచారణ ఫిభ్రవరి 26 కు వాయిదా

సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులపై తదుపరి విచారణ ఫిభ్రవరి 26 కు వాయిదా

రాష్ట్ర శాసన సభ ఆమోదించిన అభివృద్ధి వికేంధ్రీకరణ బిల్లు, సిఆర్డిఎ చట్టం ఉపసంహరణ బిల్లులను సవాలు చేస్తూ విశాఖపట్టణానికి చెందిన వ్యాపారి రామ కోటయ్య, విజయవాడ కు చెందిన శీలం మురళీధర్ రెడ్డి వేరు వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ బిల్లులపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడానికి హైకోర్టు బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

నిన్న శాసనమండలిలో ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న తరుణంలో సీజే జేకె మహేశ్వరి, జస్టిస్ ఏవి శేష సాయి లతో కూడిన ధర్మాసనం ఈరోజుకి విచారణ ని ఈరోజుకి వాయిదా వేసిన తరుణంలో, ఈరోజు పొద్దుటనుండి హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణని ఫిభ్రవరి 26 కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ అశోక్ భాన్ తన వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజి శ్రీరామ్ తో పాటు సీనియర్ సుప్రీం కోర్ట్ అడ్వకెట్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు.