సోషల్ మీడియాలో కథనాలు-ఖండించిన డీఎస్పీ..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పనవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం మూలంగా ఏలూరులో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
వివరాల్లోకి వెళితే కరోనా ఉధృతి కారణంగా ఏలూరులో సోమవారం నుండి 14 రోజుల పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించనున్నారని సోషల్ మీడియాలో అసత్య కథనాలు వైరల్ గా మారాయి.. దాంతో సోషల్ మీడియా కథనాలు నిజం అని నమ్మిన ప్రజలు ఏలూరులో జరగాల్సిన పనులను చకబెట్టుకోవడానికి ఏలూరు చేరుకోవడంతో రద్దీ బాగా పెరిగిపోయింది.. ఈరోజు సోమవారం నుండి లాక్‌డౌన్ కావడంతో అప్పుడు పూర్తి చేయాల్సిన పనుల గురించి ప్రజలు ఏలూరు చేరుకోవడంతో ఏలూరులో ప్రజల రద్దీ పెరిగింది.
ఈ అసత్య కథనాలపై స్పందించిన డీఎస్పీ దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్య కథనాలు ప్రచారం చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలను నమ్మొద్దని ప్రజలకు డీఎస్పీ దిలీప్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప సోషల్ మీడియా కథనాలను నమ్మకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.