iDreamPost
android-app
ios-app

రాశిఖన్నాకి డబుల్ బొనాంజా

  • Published May 05, 2020 | 5:45 AM Updated Updated May 05, 2020 | 5:45 AM
రాశిఖన్నాకి డబుల్ బొనాంజా

ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ రూపంలో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నాకు ప్రతి రోజు పండగే సక్సెస్ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. విజయ్ దేవరకొండ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందనుకుంటే ఏకంగా కెరీర్ కే ఓ మైనస్ గా నిలిచింది . పాత్ర కోసం కొంత బోల్డ్ గా నటించినా లాభం లేకపోయింది. దీని సంగతలా ఉంచితే కోలీవుడ్ లో అవకాశాల మీద పెద్ద కన్నె వేసిన రాశిఖన్నాకు ఇప్పుడు అక్కడ రెండు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి.

అందులో మొదటిది దర్శకుడు సుందర్ సి తీయబోయే అరన్మనై 3. హారర్ కామెడీ జానర్ లో రూపొందే ఈ సిరీస్ లో వచ్చిన గత రెండు సినిమాలు తెలుగులో చంద్రకళ, కళావతిగా డబ్బింగ్ అయ్యాయి. అందులో హన్సిక నటించిన ఫస్ట్ ది ఇక్కడా హిట్టు కొట్టింది. త్రిష నటించిన రెండోది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు మూడో భాగానికి రాశిఖన్నా ఎంటరవుతోంది. ఇందులో చేస్తున్నట్టు రాశిఖన్నానే స్వయంగా వెల్లడించింది. ఇంత హారర్ ఉన్న సబ్జెక్టులో తను గతంలో చేయలేదు కాబట్టి ఇది స్పెషల్ మూవీ అవుతుందని భావిస్తోంది.

సూర్య హీరోగా సింగం బ్రాండ్ సినిమాల దర్శకుడు హరి రూపొందించబోయే భారీ ప్రాజెక్ట్ లోనూ తననే హీరొయిన్ గా తీసుకున్నారు. తమిళ్ లో అరువా టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగు ఇంకా డిసైడ్ కాలేదు. లాక్ డౌన్ అయ్యాక దీని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. రాశిఖన్నా గత రెండేళ్ళుగా అరవంలో బాగానే ఆఫర్లు పడుతోంది. కాకపోతే గట్టి బ్లాక్ బస్టర్ పడలేదు అంతే. ఇప్పుడీ రెండు కనక క్లిక్ అయ్యాయంటే అక్కడే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోవచ్చు. ఇక్కడ పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి బ్యూటీస్ తో పోటీ అధికంగా ఉంది కాబట్టి అక్కడ పాగా వేయడమే కరెక్ట్.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibomgrandpashabet