iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ నాట్య మయూరి ఎవరో తెలుసా..?

ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తుంది. ఇక్కడి హీరోలతో ఆడిపాడేందుకు ఆసక్తి చూపుతున్నారు ముద్దుగుమ్మలు. ఎంత మంది వచ్చినా టాలీవుడ్ అవకాశం కల్పిస్తూనే ఉంటుంది. అందలం ఎక్కిస్తూనే ఉంటుంది. ఆ జాబితాలోకే వస్తుంది ఈ ఫోటోలోని చిన్నారి.

ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తుంది. ఇక్కడి హీరోలతో ఆడిపాడేందుకు ఆసక్తి చూపుతున్నారు ముద్దుగుమ్మలు. ఎంత మంది వచ్చినా టాలీవుడ్ అవకాశం కల్పిస్తూనే ఉంటుంది. అందలం ఎక్కిస్తూనే ఉంటుంది. ఆ జాబితాలోకే వస్తుంది ఈ ఫోటోలోని చిన్నారి.

సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ నాట్య మయూరి ఎవరో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమ సత్తాను చాటారు, చాటుతున్నారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఆయా పరిశ్రమకు చెందిన అందగత్తెలను టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటుంది. అయితే సినిమా హిట్ కొడితేనే నటీమణులకు మరో సినిమా అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఒక్క సినిమాతోనే పెట్టే, బేడా సర్దుకుని వెళ్లిపోవాల్సిందే. కేవలం ఒక్క సినిమాతోనే ఇంటి ముఖం పట్టిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. టాలెంట్‌తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండి.. నటించిన సినిమాలు హిట్లు కొడితే.. టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు. దర్శక, నిర్మాతలు కూడా వారి కాల్ షీట్ల కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. ఆ కోవకు చెందిందో ఈ ఫోటోలోని చిన్నారి.

క్లాసికల్ డ్యాన్స్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న ఈ కుట్టి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. కొడితే కుంభ స్థలం బద్ధలవ్వాలి అని టార్గెట్ పెట్టుకుని వచ్చినట్లే ఉంది ఈ చిన్నారి. ఇంతకు ఆమెను గుర్తు పట్టారా.. కాస్త గమనిస్తే అర్థమైపోతుంది. ఈ బుడత తన లీలతో హృదయాలను కొల్లగొడుతున్న నాట్య మయూరి శ్రీలల. ఆమె తెలుగు అమ్మాయి అయినా..పెరిగింది అమెరికాలోనే. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. ఆమె చిన్నప్పుడు భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. డాక్టర్ చదువుతూనే యాక్టర్ అయ్యింది. 2019లో కన్నడ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ కస్తూరి.. ఆ తర్వాత పెళ్లి సందDలో సందడి చేసింది. సినిమా అంతలా ఆకట్టుకోకపోయినప్పటికీ.. ధమాకా ఆఫర్ వచ్చింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్, యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

ఆ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎంతలా అంటే పక్క హీరోయిన్స్ అవకాశాలను కొల్లగొట్టేంత. ఒక్కసారిగా 8 సినిమాలకు సంతకం చేసిందంటో.. ఆమె డిమాండ్ ఎట్లుందో అర్థమౌతుంది. స్కందతో ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా భగవంత్ కేసరి సినిమాలో మెప్పించింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆది కేశవ, ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవర కొండ మూవీ (ఈ సినిమా నుండి తప్పుకుందని టాక్) ఆఫర్లు వచ్చాయి. ప్రతి సినిమాలోనూ ఆమె కనిపిస్తుండటంతో దిల్ ఖుష్ అవుతున్నారు కుర్రకారు. ఇక ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలన్నట్లు.. ఆఫర్లు వచ్చినప్పుడే రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి