iDreamPost
android-app
ios-app

లవ్ అగర్వాల్ ఎవరో తెలుసా..?

లవ్ అగర్వాల్ ఎవరో తెలుసా..?

కొరోనా వైరస్ దేశంలో విజృంబిస్తున్న తరుణంలో దేశ ప్రజలను అలర్ట్ చెయ్యాడానికి, కరోనా వైరస్ స్టేటస్ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని హెల్త్ బులెటెన్ రూపంలో మీడియాకు విడుదల చేస్తున్నప్పుడు భారతదేశపు వైద్యరంగపు ముఖ్యసారధిగా కెంద్ర అరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ గారిని ఇటీవల తరచూగా వార్తల్లో చూస్తున్నాం.

అయితే అయన పేరు ఎక్కడో విన్నట్టుందే అని అయన గురించి తెలుసుకునే విషయాలు మనకు తెలిశాయి. ఆ లవ్ ఆగర్వాల్ మరేవరో కాదు.. 2004-05 లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టినప్పుడు ఇప్పుడు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ గా ఉన్న లవ్‌ అగర్వాల్‌ అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. అప్పట్లోనే ఆయనకు సీరియస్ కమిట్మెంట్ ఉన్న అధికారి గా మంచి పేరు ఉండేది.

ఆయన కలెక్టర్ గా ఉన్న సమయంలోనే పశ్చిమ గోదావరి లో కొల్లేరు సరస్సు ప్రక్షాళన జరిగింది. ఆ సమయంలో కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులను సాగు చేస్తున్న పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరినుండి ముఖ్యమంత్రి గారి సన్నిహితుల దగ్గర నుండి అనేక మంది బడా నేతల వరకు ఆయన పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు వచ్చినా, కొందరు సహచరులు ప్రాణహాని వుండొచ్చు అని ఆయన్ని హెచ్చరించినా.. ఆయన అవేవీ లెక్క చేయకుండా పట్టుదలతో కొల్లేరుని పునరుద్ధరించారు.

లవ్ అగర్వాల్ గారి గురించి తెలుసుకోవాలంటే ఆయనలోని మంచి మనిషి గురించి చెప్పుకోవాలి. అప్పట్లో ఎయిడ్స్ రోగులను సమాజంలో చాలా నీచంగా చూస్తుండేవారు. కలెక్టర్ ఉన్న లవ్ అగర్వాల్ గారు అప్పట్లో ఒక పేద HIV రోగి గుడిసెలో 24 గంటల పాటు వుండి, వారి బాత్ రూం వాడుకొని, వారి చేతుల మీదుగా వండిన తిండి తినీ, వారి ఇంట్లోనే నిద్రించారు. ఎయిడ్స్ రోగుల పట్ల వివక్షను పోగొట్టడానికి లవ్ అగర్వాల్ గారి గంభీరమైన స్వీయ ఆచరణ చూసి తోటీ అధికారులే ఆశ్చర్యపొయారు.

2005 జూలై 4 న ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం “ఆశ” పేరిట పెద్ద ఎత్తున ఎయిడ్స్ పై పోరాట కార్యక్రమం ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో లవ్ అగర్వాల్ చాలా ప్రముఖ పాత్ర పోషించారు.

అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆశ కార్యక్రమం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారి ఎడమ పక్కన కలెక్టర్ లవ్ అగర్వాల్