iDreamPost
iDreamPost
మహిళలపై దాడులను నివారించేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై దేశం నలుమూలనుండి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఈ చట్టం పలు రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. ఢిల్లీ , ఒడిస్సా ,కేరళ ప్రభుత్వాలు ఈ చట్టం తాలూకు ప్రతులను పరిశీలించేందుకు తమకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మహరాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆ ప్రభుత్వం కూడా దిశా చట్టం వైపు చూసేలా చెసింది.
గత నెల ఫిబ్రవరి 3న మహరాష్ట్రలోని వార్ధ జిల్లాలో 24ఏళ మహిళా ఉపాధ్యాయురాలిని ప్రేమ పేరుతో ఒక ఉన్మాది వేధించి చివరికి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళ భద్రత పై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్త్రీల భద్రతపై ఒక కొత్త చట్టం తీసుకుని వస్తామని హామి ఇవ్వడం, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రవేశ పెట్టిన దిశా చట్టాం గురించి తెలుసుకుని ఈ చట్టాన్ని పూర్తిగా అధ్యయనం చెసేందుకు ఫిబ్రవరి 20వ తారీకున మహరాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాష్ట్రానికి వచ్చి వై.యస్ జగన్ ని కలుసుకుని దిశా చట్టం పై సుదీర్ఘంగా చర్చించటం జరింది.
అయితే తాజాగ ఈ చట్టాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన మహరాష్ట్ర సర్కార్ దిశా చట్టం స్పూర్తితో మహిళా భద్రతపై ఒక సరికొత్త చట్టం తీసుకురావడం కోసం నడుంబింగించి, దీనికోసం ఈ నెల 14నుండి ప్రారంభం అయిన ప్రతేక అసెంబ్లీ సమావేశాల్లో రెండు రోజులు ఈ బిల్లు పై చర్చకు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, 21రోజుల్లో కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైన మహిళా భద్రత పై జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశా చట్టం పలు రాష్ట్రాలకు దిక్సూచి అవ్వడం గర్వకారణం.