iDreamPost
android-app
ios-app

ఇంతేనా రాజా – మొదటివారం వసూళ్లు

  • Published Feb 01, 2020 | 5:39 PM Updated Updated Feb 01, 2020 | 5:39 PM
ఇంతేనా రాజా – మొదటివారం వసూళ్లు

మొన్న ఏడాది మూడు డిజాస్టర్లతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మాస్ మహారాజా రవితేజకు డిస్కోరాజా అయినా సక్సెస్ ఇస్తుందేమో అనుకుంటే ఇది కూడా నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకుని ఫైనల్ రన్ వైపు వెళ్తోంది. అందిన సమాచారం మేరకు మొదటి వారం పూర్తి చేసుకున్న డిస్కోరాజా 7 కోట్ల 65 లక్షల షేర్ వసూలు చేసినట్టుగా తెలిసింది. థియేట్రికల్ బిజినెస్ ప్రకారం పెట్టుబడి మొత్తం 22 కోట్ల దాకా ఉండగా ఇంకా మూడు వంతులు వెనక్కు రావాల్సి ఉంది. ఇప్పుడీ ట్రెండ్ ప్రకారం చూస్తే అది అసాధ్యం లాగే కనిపిస్తోంది.

ఫస్ట్ వీకెండ్ ని కూడా డిస్కోరాజా పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయాడు. దీనికి వచ్చిన వీక్ టాక్ వల్లే మహేష్ బన్నీ సినిమాలు మళ్లీ పుంజుకున్నాయి. స్టోరీ పాయింట్ లో కొత్తదనం ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ విషయంల్ దర్శకుడు విఐ ఆనంద్ రొటీన్ ఫార్ములాలో వెళ్లడంతో ప్రేక్షకులు ఆశించిన విధంగా అంచనాలు అందుకోలేకపోయాడు. ఫైనల్ రన్ ఇంకో వారం తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం జాను, సవారీలు రాబోతుండగా వాలంటైన్ డే రోజున వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు రెండు మూడు డబ్బింగ్ ప్రాజెక్టులు లైన్ లో నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో డిస్కోరాజా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. నైజామ్ లోనే డిస్కోరాజా అధికంగా 2 కోట్ల 65 లక్షల షేర్ రాబట్టుకోగా అల్పంగా నెల్లూరు నుంచి కేవలం 25 లక్షలు మాత్రమే తెచ్చింది. ఏరియాల వారీగా వసూళ్లు కింది విధంగా ఉన్నాయి

ఏరియా వారి మొదటి వారం కలెక్షన్స్  

ఏరియా  షేర్ 
నైజాం  2.75cr
సీడెడ్  95L
ఉత్తరాంధ్ర  94L
గుంటూరు  45L
క్రిష్ణ  42L
ఈస్ట్ గోదావరి  51L
వెస్ట్ గోదావరి  37L
నెల్లూరు  25L
ఆంధ్ర + తెలంగాణా మొత్తం  6.65cr
కర్ణాటక  + రెస్ట్ అఫ్ ఇండియా   45L
ఓవర్సీస్   55L
ప్రపంచవ్యాప్తంగా  7.65cr