iDreamPost
iDreamPost
మాస్ మహారాజా ఏడాది గ్యాప్ తర్వాత చేసిన డిస్కో రాజా ఓ మాదిరి ఓపెనింగ్స్ తో మొదటిరోజులు పర్వాలేదు అనిపించుకుంది. నిజానికి ఇవి రవితేజ ఇమేజ్ స్థాయి కలెక్షన్స్ కాదు. అయినా కూడా మూడు డిజాస్టర్ల తర్వాత 2.5 కోట్ల దాకా షేర్ రావడం అంటే అంతో ఇంతో సంతోషించదగ్గ విషయమే. టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో సుమారు 22 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్ల ఆశలు ఏమవుతాయో వేచి చూడాలి. ఒకవేళ సోమవారం నుంచి డ్రాప్ కనక ఎక్కువగా ఉంటే ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు సగం రావడం కూడా కష్టమే.
పైగా సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్నాయి. అల వైకుంఠపురములో ఇంకా నెమ్మదించలేదు. సరిలేరు నీకెవ్వరు కూడా బాగానే రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో డిస్కో రాజాకు పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన డిస్కో రాజాకు తమన్ సంగీతం అందించగా పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ డే పది శాతం మాత్రమే రాబట్టిన డిస్కో రాజా ఇకపై ఏం చేస్తాడో చూడాలి. ఏరియాల వారిగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
– ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
ఏరియా | షేర్ |
నైజాం | 1.10cr |
సీడెడ్ | 0.36cr |
ఉత్తరాంధ్ర | 0.31cr |
గుంటూరు | 0.20cr |
క్రిష్ణ | 0.18cr |
ఈస్ట్ గోదావరి | 0.19cr |
వెస్ట్ గోదావరి | 0.15cr |
నెల్లూరు | 0.6cr |
ఆంధ్ర తెలంగాణా | 2.55cr |