iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమనే టార్గెట్ ని అందుకోవడమే కష్టంగా మారిన తరుణంలో ఇటీవలే ఓ టీవీ వీడియో కాల్ ఇంటర్వ్యూలో రాజమౌళి తాను త్వరలో ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించడం అభిమానులకు ఒక పక్క సంతోషాన్ని మరోపక్క ఆందోనళను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే జక్కన్న తీసుకునే టైం. బాహుబలి రెండు భాగాలకు ఐదేళ్లు పట్టింది. ఎంత ప్లానింగ్ తో ఆర్ఆర్ఆర్ స్టార్ట్ చేసినా ఇప్పటికే రెండేళ్లు దాటింది. అనుకోని అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తేదీలు మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ తో మూవీ అంటే రాజమౌళి ఎంత టైం తీసుకుంటాడో అనే అనుమానం కలగడం సహజం.
ప్రస్తుతం పరశురామ్ కు కమిట్ అయిన ప్రిన్స్ దాని తాలూకు ప్రకటన ఈ నెల 31న చేయబోతున్నారు. అదే రోజు మరో అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. బహుశా అది రాజమౌళిదేనని కొందరు లేదు వంశీ పైడిపల్లిదని మరికొందరు చెబుతున్నారు. ఒకవేళ పరశురామ్, వంశీలవి రెండు సినిమాలు ఉంటే ఇంకో ఏడాది తర్వాతే రాజమౌళిది మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా ఖచ్చితంగా రెండేళ్లకు పైగా అవసరం. ఫ్యాన్స్ దానికి ముందే మెంటల్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద చూసి ఇప్పటికే పాతిక నెలలు దాటింది. ఇంకో ఏడెనిమిది నెలలు అదనంగా పట్టడం ఖాయం. ఇంచుమించు రామ్ చరణ్ ది కూడా ఇదే పరిస్థితే.
కానీ మహేష్ ఎప్పుడు ఇంత గ్యాప్ తీసుకుని మూవీస్ చేయలేదు. రాజమౌళి ఆలోచనలు ఎలాగూ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటాయి కాబట్టి బడ్జెట్ తో పాటు సబ్జెక్టు కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దుతయారు. ఈ నేపథ్యంలో భారీ ఎదురు చూపులు తప్పేలా లేవు. అందుకే రాజమౌళి కన్నా ముందే పరశురామ్, వంశీల ప్రాజెక్టులు పూర్తి చేస్తే మార్కెట్ పరంగా కంటిన్యూటీ ఉంటుంది. తర్వాత జక్కన్న వల్ల గ్యాప్ తో ఎక్కువ నష్టం ఉండదు. ఆర్ఆర్ఆర్ తప్ప ఇంకో ప్రపంచం లేకుండా ఉన్న జక్కన్న మహేష్ సినిమాను ఏ జానర్ లో రూపొందిస్తాడన్న దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. లాక్ డౌన్ అయ్యేదాకా ఇలాంటి బదులు లేని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది