iDreamPost
android-app
ios-app

ఆ నాయకుడికి ఎమర్జెన్సీ పెట్టాల్సిందేనంట..:

ఆ నాయకుడికి ఎమర్జెన్సీ పెట్టాల్సిందేనంట..:

రాజకీయాల్లో విలువలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలైతే మరింత దిగజారిపోయాయి. తాజాగా మాజీమంత్రి, కృష్ణా జిల్లా ప్రముఖ టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీలో పరిస్థితులు విషమించాయని, రాష్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం రాజకీయాల్లో అవకాశవాదానికి నేటి మేటి ఉదాహరణగా నిలుస్తోంది. 

రాజకీయ అక్కసు…

ఏపీలో కరోనా వేళా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరాటం సాగుతోంది. రెండు పార్టీల్లోనూ కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే తెలుగుదేశం నుంచి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు కాస్త శృతి మించుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలంటూ శనివారం ఆయన కేంద్రాన్ని కోరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రం పరువును మాజీ మంత్రి బజారును పడేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఏమి ఆశించి….

ప్రతిపక్ష టీడీపీ కరోనా సమయంలోనూ రాజకీయాలు మొదలు పెట్టడం… దానికి కౌంటర్గా అధికార పక్షం వైయస్సార్సీపీ సైతం ప్రతి విమర్శలు చేయటం కొంతకాలంగా జరుగుతోన్న తంతే..! కానీ, ఈ రాజకీయాన్ని దేవినేని ఉమా మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఏపీలో ఎక్కడా జరగనిదేదో జరుగుతోందనే ప్రచారంతో…కేంద్రం జోక్యాన్ని కోరుతున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు వైఎస్ జగన్ ను, ఆయన పార్టీని ఎన్నుకొని ఏడాదికూడా కాలేదు…అప్పుడే ప్రజాలిచ్చిన అధికారంలోకి కేంద్రం జోక్యాన్ని కోరడమంటే ప్రజా తీర్పును అవమానించటమే. ఇది నిజంగా ఆక్షేపణీయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు వద్దు…మరిప్పుడు కావాలా…

రాష్ట్రాల విషయంలో కేంద్రం జోక్యం ఏంటి..? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు సమాన హుక్కులు ఉంటాయి..? మోడీ వ్యవస్థలను భ్రస్టు పట్టిస్తున్నారు…? ఇవి గత ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని. ఆ క్రమంలోనే చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు చేస్తుందేమో అని 

భయపడి… ఏపీలోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారు. తద్వారా ముందస్తు అనుమతి లేనిదే రాష్ర్టంలోకి అడుగుపెట్టకుండా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నిలువరించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. తీరా ఇప్పుడు చూస్తే అదే పార్టీ…అదే నాయకులు కేంద్రాన్ని రాష్రంపై కర్ర పెత్తనం చేయాల్సిందిగా కోరుతున్నారు. దీంతో ఇది కదా రెండు నాలుకల ధోరణనంటే అనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.

కేంద్రం వింటుందా…

దేవినేని ఉమా అయితే కేంద్రం రంగంలోకి దిగాలంటూ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన డిమాండ్ ను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా…? అసలా ఆ ఆస్కారం ఉందా..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హెల్త్  ఎమర్జెన్సీ పరిస్థితులే ఉన్నాయి. దానికి మనదేశం, రాష్రం వినహాయింపేమీ కాదు. దీన్ని బట్టి దేవినేని ఉమా కొత్తగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం కాదిది. పైగా ఏపీ కంటే మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో దేవినేని డిమాండ్ నే పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఆయా రాష్ట్రాల పరిపాలనలోనూ వేలుపెట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే దేశంలో కరోనాను మించిన రాజకీయ తుపాన్ రావడం ఖాయం. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు కోరికను కేంద్రం మన్నించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.