iDreamPost
android-app
ios-app

దసరా పండక్కు OTT కానుకలు

దసరా పండక్కు OTT కానుకలు

రేపు దసరా పండగ సందర్భంగా థియేటర్లలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటికే మాత్రం తీసిపోని తరహాలో ఓటిటి కంటెంట్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ చెప్పాపెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ చేసేశారు. కనీస పబ్లిసిటీ లేకుండా మైత్రి లాంటి పెద్ద బ్యానర్ మూవీ ఇలా రావడం ఆశ్చర్యమే. పట్టుమని నెల తిరక్కుండానే మూడో వారంలోనే డిజిటల్ లో రావడం విశేషం. సుధీర్ బాబు-కృతి శెట్టిల జంటను స్మార్ట్ స్క్రీన్ మీద చూసే వాళ్ళు గట్టిగానే ఉంటారు. అనసూయ ఊర మాస్ పాత్రలో నటించిన ‘దర్జా’ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆహా ద్వారా అందుబాటులోకి రానుంది.

ఇదే ప్లాట్ ఫార్మ్ మీద ఆ మధ్య వచ్చిన మరో చిన్న మూవీ ‘ఉనికి’ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మోస్ట్ వాంటెడ్ మూవీ అఫ్ ది సీజన్ ‘కార్తికేయ 2’ రేపటి నుంచి జీ5లో ఎంజాయ్ చేయొచ్చు. హిందీలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ప్యాన్ ఇండియా సినిమాని బిగ్ స్క్రీన్ మీద మిస్ చేసుకున్నవాళ్లకు ఇక పండగే. అక్షయ్ కుమార్ లేటెస్ట్ డిజాస్టర్ ‘రక్షా బంధన్’ ఇదే ఓటిటిలో విజయదశమి కానుకగా ఇస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ దట్టించారు కాబట్టి రెస్పాన్స్ ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. రెండు రోజుల క్రితమే వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ ఫ్లాప్ ‘రంగ రంగ వైభవంగా’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. శాకినీ డాకిని కూడా ఇందులోనే సందడి చేస్తోంది.

ఇవి కాకుండా మాధురి దీక్షిత్ లేట్ ఏజ్ లోనూ చలాకిగా డాన్స్ చేస్తూ నటించిన ‘మజిమా’ గురించి ప్రైమ్ భారీ పబ్లిసిటీ చేస్తోంది. తెలుగు ఆడియో అందుబాటులో ఉంటుంది. ప్రోమోలు గట్రా చూస్తుంటే అంచనాలు పెంచుతోంది. సో పండగ పూట హాలు దాకా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏం వెళతాంలే అనుకుంటే ఇదిగో ఇలా బోలెడు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. సడన్ సర్ప్రైజ్ లాగా మరికొన్ని ఉన్నా ఆశ్చర్యం లేదు. నిర్మాతలు అనుకున్న ప్రకారం ఎనిమిది వారాల గ్యాప్ ప్రాక్టికల్ గా అమలు చేయడం అంత ఈజీగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఫ్లాపులు డిజాస్టర్లు నెలల తరబడి ఓటిటిలో రాకుండా నియంత్రించడం మాటల్లో చెప్పుకున్నంత సులభమైతే కాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి