iDreamPost
iDreamPost
సంక్రాంతి రేస్ లో మొదట బరిలో దిగిన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ తెలుగు ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా పండగ సీజన్ ని వాడుకుని బాగానే రాబట్టుకుంది. గత ఏడాది ఇదే టైంలో వచ్చిన పేట కంటే మెరుగైన వసూళ్లు సాధించి రెండో వారంలో కొనసాగుతోంది. మొదటి వారంకే 8 కోట్ల 60 లక్షలంటే మంచి ఫిగరే. అయితే ఒక పక్క మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, మరోపక్క అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ధాటికి రజని నిలవడం చాలా కష్టమైపోతోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు ఆ రెండింటికే ఓటు వేయడంతో తలైవాకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కష్టాలు తప్పడం లేదు. జరిగిన థియేట్రికల్ బిజినెస్ లో ఇంకా సగమే వెనక్కు తెచ్చిన దర్బార్ మీద ఇంకా చాలా బాధ్యత ఉంది. ప్రస్తుతమున్న ట్రెండ్ ని బట్టి చూస్తే అది అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఎల్లుండి నుంచి పండగతో పాటు సెలవుల హడావిడి పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలో దర్బార్ లెక్కల్లో మెరుగుదల కష్టమే. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా ఇంకో ఏడెనిమిది కోట్లు రాబట్టాలని ట్రేడ్ పండితుల మాట. అందిన సమాచారం మేరకు మొదటివారం దర్బార్ కు వచ్చిన ఏరియాల వారి లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా వారి మొదటి వారం కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 4.25cr |
సీడెడ్ | 0.98cr |
ఉత్తరాంధ్ర | 0.95cr |
గుంటూరు | 0.65cr |
క్రిష్ణ | 0.48cr |
ఈస్ట్ గోదావరి | 0.67cr |
వెస్ట్ గోదావరి | 0.32cr |
నెల్లూరు | 0.34cr |
ఆంధ్ర + తెలంగాణా మొత్తం | 8.64cr |